వ్యర్ధాలను ఎరువుగా మార్చడం

వ్యర్ధాలను ఎరువుగా మార్చడం

ప్రతిరోజు చాలా వ్యర్ధాలను చూస్తుంటాము. అవసరం లేని పదార్ధాలను వ్యర్ధాలు అని అంటాము. వ్యర్ధ పదార్ధాలు ఎక్కడపడితే అక్కడ పడేయ్యడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్న వ్యర్ధ పదార్ధాలను సరైన పద్ధతిలో నిర్మూలన, నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యర్ధాలను మూడు రకాలుగా విభజించవచ్చు.

మొక్కల వ్యర్ధాలు: ఎండిన ఆకులు, కొమ్మలు, పువ్వులు మొదలైనవి.
పశువుల వ్యర్ధాలు: పశువుల మూత్రం, పేడ, కుళ్ళిన మేత మొదలైనవి.
ఇంట్లోని వ్యర్ధాలు: మనిషి మల మూత్ర విసర్జన, ఇంటి వంటింటి గదిలోని చెత్త మొదలైనవి.

ఈ వ్యర్ధాలు రెండు రూపాలలో వుంటాయి

  1. ఘన రూపం
  2. ద్రవ రూపం

ఘన రూప వ్యర్ధాలు:

విసర్జితాలు మరియు నీరు ఎక్కువ లేకుండ ఉన్న ఇతర ఏ వ్యర్ధాలైన ఘన వ్యర్ధ పదార్ధాలు అంటారు. వీటిలో కొన్ని భూమిలో కుళ్లేవి వీటితో జీవఎరువును తయారుచేసుకోవచ్చు. మరికొన్ని కుళ్ళినవి. కుళ్ళినవి పునర్వినియోగానికి అనుకూలంగా వుంటాయి.

కంపోస్ట్ గుంత నిర్మాణం:

కుళ్లే ఘన వ్యర్ధ పదార్ధాలను ఒక గుంతలో వేస్తే జీవ రసాయనిక చర్య వలన అవి కుళ్ళి జీవ ఎరువుగా మారుతాయి. దీనినే కంపోస్ట్ గుంత అంటాము.1 మీ x 1 మీ x ½ మీ పరిమాణంలో గుంతని ఇంటి ఆవరణంలో ఒక మూల అంతగా వాడని ప్రదేశంలో తవ్వాలి. ప్రతిరోజు వచ్చే వ్యర్ధ పదార్ధాల పరిమాణాన్ని బట్టి గుంత పరిమాణం నిర్ణయించుకోవచ్చు. గొయ్యి అడుగున 8 అంగుళాలు మేర కొబ్బరి పీచు లేక ఎండు గడ్డి వంటి పీచుపదార్ధం, దానిపై 4 అంగుళాలు మేర తుమ్మ, గానుగ, పెసర ఆకులు, కొమ్మలు వంటి ఆకుపచ్చని పదార్ధాలను వెయ్యాలి. ఈ పొరల పై ఆవు పేడ లేక తడిమట్టిని లేక రెండిటిని వెయ్యాలి.

vyardhalanu-eruvuga-marchadam-1

పశువుల మల మూత్రాలు,ఇతర వ్యర్ధ పదార్ధాలను ప్రతిరోజు గుంతలో వేసి ఎప్పటికప్పుడు దానిని సమంగా సర్దాలి. వ్యర్ధపదార్ధాలు పెద్ద పెద్ద పరిమాణంలో వుంటే వాటిని ముక్కలుగా చేసి వేయ్యాలి. ప్లాస్టిక్ వస్తువులు, నిర్మాణ సామాగ్రి వంటి పదార్ధాలను వేయ్యరాదు. 6 అంగుళాలమేర వ్యర్ధపదార్ధాలు వేశాక దాని పై ఎండుగడ్డిని పరిచి కొద్దిగా యూరియ కలిపిన నీటిని చిలకరించాలి, లేదా పశువుల కొట్టం కడిగిన తరువాత వచ్చే నీటిని అందులో పడేలా చేయ్యాలి. అందువల్ల గుంత లోని పదార్ధాలు త్వరగా కుళ్ళుతాయి. గుంత పూర్తిగా నిండాక దానిని గడ్డితో కప్పి గట్టిగా తొక్కాలి. దానిపై బరువుకోసం రాళ్ళు ఉంచవచ్చు.

15-20 రోజులకొకసారి పై గడ్డి తీసి ఒకసారి అంతా కలియతిప్పాలి. 60-70 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది.

ఇంకుడు గుంత:

మూత్రశాల గొట్టాల నుండి నీటిని వ్యర్ధాలను ఇంకుడు గుంతలోకి మళ్ళించాలి. మన వీలుకు అనుగుణంగా త్రవ్వుకోవచ్చు. వర్షపు నీటిని కూడా అందులోకి మళ్ళీంచదలిస్తే, గుంతను ఇంటి ఆవరణలో బాగా పల్లంగా ఉన్నచోట తవ్వాలి. అందుబాటులో స్థలాన్ని బట్టి పరిమాణం నిర్ణయించుకోవచ్చు.గుంత అడుగున మూడింట ఒక వంతు వరకు పెద్దసైజు రాళ్ళను నింపాలి. వాటిపై మరో వంతు చిన్న సైజు రాళ్ళను వెయ్యాలి.

vyardhalanu-eruvuga-marchadam-2

మొక్కలకు మళ్ళించడం:

నీరు నిలువ ఉంటే ప్రమాదకరం, అందువల్ల వాటిని పెరటి తోటకు వినియోగించి కూరగాయల రూపంలో లబ్ధి పొందవచ్చు. నీరు స్నానాల గది నుండి, అంట్లుతోమే ప్రాంతం, బట్టలుఉతికే ప్రాంతం, వంటగది నుండి వచ్చే నీటిని మొక్కలకు కాలవల ద్వారా మళ్ళించాలి.

Share this post


Watch Dragon ball super