సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రకృతిలో దొరికే సహజమైన వనరులను ఉపయోగించి చేసే ప్రకృతి ఆధారిత వ్యవసాయం.

sendriya-vyavasaayam-4సేంద్రియ వ్యవసాయాన్నిప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ది పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభిoచే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, ప్రకృతి నుండి లభించే పదార్ధాలతో వానపాముల ఎరువును, అలాగే పశువుల నుండి పేడ, మూత్రం సేకరించి వాటి నుండి ఎరువును – సహజసిద్ధమైన రీతిలో వాటిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో చేసేది సేంద్రీయ వ్యవసాయం. హానికారక రసాయనిక ఎరువులు, పర్యావరణానికి హాని చేసే పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ సేద్య, జీవసంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో చేసేది సేంద్రీయ వ్యవసాయం.

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది రైతులు వారి పంట దిగుబడి అధికమవడం కోసం కొత్త రకాల పురుగు మందులను (కీటక నాశినిలను), నూతన ఎరువులను ఉపయోగించి సాగు చేస్తున్నారు. కానీ ఈ పధ్ధతి ఇలాగే కొనసాగించడం వలన భూమి తన సారాన్ని కోల్పోతుంది. అలాగే ఉండే కొద్దీ పంట దిగుబడి క్రమక్రమంగా కొన్ని సంవత్సరాలలో తగ్గిపోతుంది. రైతులు ప్రస్తుత లాభాన్ని, డబ్బుని చూసుకొని ఇలాంటి పద్ధతిలో వ్యవసాయం చేస్తే రానున్న కాలంలో మనం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కోవలసి వస్తుంది.

పెరిగే జనాభాని దృష్టిలో ఉంచుకొని, పంట మార్పిడి – ఒక్కో కాలంలో ఒక్కో పంటను కాలానుగుణoగా రకరకాల పంటల్ని సాగు చేస్తే, తద్వారా మనం అందరికి సరిపడా ఆహారం, అధిక పంట దిగుబడిని, ఆహార కొరతను నియoత్రిచ్చవచ్చు.

K.SPANDANA DEEPIKA,
STUDENT OF IV YEAR,
DEPARTMENT OF HECM.

Share this post


Watch Dragon ball super