సహజ రంగులు – ఉపయోగాలు

సహజ రంగులు – ఉపయోగాలు

సహజ రంగుల వల్ల ఉపయోగాలు:
• ఇవి శరీరానికి హానిచేయవు.
• ఇవి ఎటువంటి శ్వాసకోశ,చర్మ ఎలర్జీలకు దారితీయవు.
• రంగులు తీయగా మిగిలిన పదార్ధాలు పంటలకు మంచి ఎరువులుగా ఉపయోగపడతాయి.
• ఇవి ఎంతో నాణ్యత, మన్నికను కలిగి ఉంటాయి.
• ఇవి రకరకాలైన, ఆకర్షణియమైన వర్ణాలనిస్తాయి.
• వీటిని ఉపయోగించడం, తయారుచేయటం చాలా తేలిక.

సహజ రంగులనిచ్చే మొక్కలు,వాటి భాగాలు:
పూలు: బంతి, చామంతి, మోదుగ, పట్టేడపూలు, కుసుమ, తురక బంతి, తుమ్మ పూలు, కొండ బూరుగ, మందార, నూరు వరహాలు, శంఖుపూలు, కాగితంపూలు, గోగు
ఆకులు: వేప, గోరింట, గుంట గలిజేరు, టేకు, నీలిమందు, టీ ఆకులు
బెరడు: వేప, నీలగిరి, మామిడి, తుమ్మ, నల్లమద్ది, మర్రి, పనస, రావి
గింజలు: జఫ్రా
పండ్ల తొక్కలు: దానిమ్మ
వేర్లు: మంజిష్ట (చావాల్ గోడి), రతన్ జోత
కాయలు: కరక్కాయ
పొట్టు: ఉల్లిపాయల పొట్టు
దుంపలు: పసుపు, బీట్ రూట్

వివిధ రకాల మొక్కలు, చెట్ల భాగాలను ఉపయోగించి ముదురు గోధుమ , పసుపు, గులాబి, ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మరియు నలుపు రంగులలోని వివిధ రకాలైన షెడ్ లను గోగునారపై పొందవచ్చు. ఈ సహజ రంగులు వేసే ప్రక్రియలో పటిక,మైలు తుత్తం, ఇనుము వంటి ఖనిజ లవణాలను మోర్డెంటులుగా చేర్చడం వల్ల నారకు రంగు బాగా పడి మన్నిక ఉంటుంది. అంతేకాకుండా విదేశాలలో ఈ రంగులతో తయారైన వస్తువులకు ఎంతో గిరాకీ ఉండటం వల్ల వీటిని ఉపయోగించి అధిక లాభాలను ఆర్జించవచ్చు.

సహజ రంగులనిచ్చే కొన్ని మొక్కలు:

వ.సంఖ్యశాస్త్రీయ నామంవ్యవహారిక నామం సహజరంగులనిచ్చే భాగాలు
1.అకేషియా అరాబికతుమ్మబెరడు
2.బిక్సా అరెల్లానజాఫ్రాగింజలు
3.బ్యూటియా ఫ్రోడోసామోదుగపూలు
4.కాషియా ఫిస్టోలాఅమల్తాస్బెరడు
5.కుర్ కుమలాంగ పసుపు వేరు
6.యుజేనియా జంబోల్వా నేరేడుబెరడు
7.ఫైకస్ బెంగాలెన్సిస్ మర్రి బెరడు
8.ఫైకస్ రెలిగోసారావిబెరడు
9.ఇండిగో ఫెరాటింక్టోరియా నీలిమందు ఆకులు
10.లాసోనియా ఆల్బా గోరింటఆకులు, వేర్లు, బెరడు
11.మాంజిఫెరా ఇండికా మామిడిబెరడు
12.మెరిండా సిట్రిఫోలియా మునగబెరడు
13.ఆర్నీబియా వోబిలిస్ రతన్ జోత్వేళ్ళు
14.ప్లూనియా క్రేoటమ్ దానిమ్మ తొక్క
15.అల్లియం సెప ఉల్లి తొక్క
16.అకేషియా కటచూకత్తా బెరడు
17.రూబియా కార్డ్ఫోలియా మంజిష్టవేర్లు
18.టేర్మినేలా చేబూలాకరక్కాయకాయలు, పూలు
19.అజాడిరక్తా ఇండికావేపబెరడు

సహజ రంగుల అద్దకమునకు పాటించవలసిన సూత్రాలు:

  • సహజ రంగుల అద్దకమునకు మొక్కల యొక్క భాగాలతో పాటు మోర్డెంటులు కూడా అవసరం అవుతాయి.
  • ఎక్కువ ముదురు రంగులు రావాలంటే ఎక్కువ మోతాదులో మొక్కల యొక్క భాగాలు తీసుకోవాలి.
  • నార యొక్క పరిమాణం బట్టి రంగు ద్రావణం తయారు చేసుకోవాలి.
  • ఖనిజ మొర్డెంటులు వాడేటప్పుడు సూచించిన మోతాదులో మాత్రమె వేసుకోవాలి. లేత రంగులు కావాలంటే తగ్గించుకోవచ్చు. కాని సూచించిన దానికంటే ఎక్కువ మోతాదులో వాడకూడదు. దీని వల్ల గోగునార నాణ్యత దెబ్బతినే అవకాసం ఉంది.
  • దాదాపు అన్ని సహజరంగులు ఒక రకమైన మొర్డెంటుతో ఒకే విధమైన షెడ్ లను ఇవ్వడం జరుగుతుంది. కనుక సహజ రంగులను ఉపయోగించేటప్పుడు వాటి ఖర్చును దృష్టిలో ఉంచుకొని మన పరిసరాలలో సమృద్దిగా దొరికే మొక్కలను ఉపయోగించడం వలన రంగుల అద్దకము యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు.
  • సహజ రంగులు ఉపయోగించి అనేక షేడ్ లను పొందవచ్చు.ఉపయోగించిన మోర్డెంటులు,రంగు గాడత,అద్దకం సమయం బట్టి షేడ్ లు మారుతూ ఉంటాయి.
  • సహజ రంగుల వివిధ రకాలైన రాగి,ఇనుము,అల్యూమినియo,ఇత్తడి,వంటి లోహ పాత్రలు ఉపయోగిస్తే ఇవి లోహాలతో చర్యపొంది వివిధ వర్ణాలను ఇస్తాయి.అందువలన నిర్ధిష్టమైన రంగులను పొందటం కష్టం.కావున సహజ రంగులను మరగ పెట్టేటపుడు స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలను ఉపయోగించాలి.

సహజ రంగుల అద్దకమునకు కావలసిన వస్తువులు:
గోగునార,సహజ రంగులు, మోర్డెంటులు,ప్లాస్టిక్ టబ్బులు, స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలు,చెక్క గరిటెలు మరియు నీరు.

మోర్డెంటులు:
ఈ సహజ రంగులు వేసే ప్రక్రియలో పటిక, మైలుతుత్తం, ఫెర్రస్ సల్ఫేట్, టిన్ వంటి ఖనిజ లవణాలను మోర్డెంటులుగా చేర్చడం వలన నారకు రంగు బాగా పట్టి మన్నికగా ఉంటుంది.

సాధారణంగా రెండు రకాల సహజ రంగులు మనం గమనించవచ్చు.
1) స్థిరమైన సహజ రంగులు: ముఖ్యంగా కరక్కాయ వంటి సహజ రంగులకు మోర్డెంటిoగ్ అవసరం లేదు.
2) విశేషణ సహజ రంగులు: ఇటువంటి సహజ రంగులకు మోర్డెంటు కలపడం వలన ఎందు కలిసి గోగుపై శాశ్వతమైన రంగులనిస్తాయి. మోర్డెంటు వాడటం వలన నార సహజ రంగులను బాగా పీల్చుకోనినట్లు చేస్తాయి. మోర్డెంటులు వాడక పోయినట్లయితే సహజ రంగులు గోగునారలోనికి చోచ్చుకుపోలేకా వేలిసిపోవడం గాని , ఉతికినప్పుడు రంగులు పోవడం గాని జరుగుతుంది.

తీసుకోవాలసిన జాగ్రత్తలు: అన్ని మోర్డెంటులు విషపూరితం కానప్పటికీ మోర్డెంటులను చిన్నపిల్లలు మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. మోర్డెంటులను వాడిన తరువాత జాగ్రత్తగా భద్రపరచావలెను. మోర్డెంటుకు మరియు రంగులు వేయడానికి ఉపయోగించిన పాత్రలను వంట చేయడానికి ఉపయోగించరాదు. ఇనుము మరియు అల్ల్యుమినియం తో తయారైన పాత్రలు సహజ రంగులతో చర్య పొందుతాయి. కాబట్టి స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలను ఉపయోగించడం మంచిది. పటిక, మైలుతుత్తం, ఫేర్రస్ సల్ఫేట్, స్టానన్ క్లోరైడ్ అనే రసాయనాలను మోర్డెంటులుగా ఉపయోగించవచ్చు.

పటిక లేదా ఆలమ్(పొటాషియం అల్యూమినియం సల్ఫ్ ట్): ఇది సహజ రంగులకు సాధారణంగా వాడే మోర్డెంటు. ఇది చాలా విరివిగా ఉపయోగిస్తారు. దీనివలన రంగు ఏ మాత్రం ప్రభావితం కాదు.

ఇనుము(ఫెర్రస్ సల్ఫేట్): ఇది ఎక్కువగా సహజరంగులను ముదురు రంగులుగా మారుస్తుంది. నలుపు, బ్రౌన్ ముదురు రంగులు కావలనుకుంటే ఫేర్రస్ సల్ఫేట్ తో మోర్డెంటింగ్ చేయాలి. ఫెర్రస్ సల్ఫట్ను చాలా ఎక్కువ మోతాదులలో వాడకూడదు. దీనివల్ల నార బిరుసుగా తయారవుతుంది.

టిన్ (స్తేనస్ క్లోరేడ్): ఇది ముక్యంగా ఎరువు ఆరెంజ్ మరియు పసుపు రంగులు కావాలను కొనేటప్పుడు దీనిని వాడటం వలన ప్రకాశవంతమైన రంగులను పొందవచ్చు. దీనికి కోరికే గుణం ఉండటం వలన దీనిని వాడేటప్పుడు చేతులకు తగలకుండా కొద్దిగా జాగ్రత్త పాటించాలి.

మైలుతుత్తం (కాపర్ సల్ఫేట్): ఆకుపచ్చ రంగులు కావాలనుకొనేటప్పుడు దీనిని వాడవచ్చు. ఇది విషపదార్ధం . చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి.
టానిక్ ఆమ్లం: బ్రౌన్స్ కావాలనుకుంటే ఇది మంచి మోర్డెంటుగా పనిచేస్తుంది.

సహజ రంగుల అద్దకము విధానము
1.నార ఎంపిక:
అలంకరణ వస్తువులకు వాడే గోగునార తెల్లగా, మంచి మెరుపుతో ఉండాలి. దమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉన్నపుడే రంగు వేయడం తేలిక అయి రంగు నారకు బాగా పడుతుంది. అందుచేత నారను ఎంపిక చేసేటప్పుడు ఈ క్రింది జాగ్రతలు పాటించాలి.
తెల్లగా మంచి మెరుపుగల నారను ఎంపిక చెసుకూవాలి.
నల్లటి నారను, మచ్చలు గల నారను వాడకూడదు.
కర్రలు ఉన్న నారను ఎంపిక చేయకూడదు.
గోగునార పొడవుగా ఉండటం చేత వాటిని మడిచి కట్టలు కడతారు. కట్టలు విప్పి, ముడతలు తీసి, నారను ఎంపిక చేయాలి.
నార చిక్కులు పడకుండా జాగ్రతలు వహించాలి.
గోగు మొక్క కాడలను వేర్లతో సహా భూమి నుండి పీకి ఊరవేస్తారు. అందుచేత చివర్లు నల్లగా ఉంటాయి. వీటిని ముందుగా కత్తిరించుకోవాలి. తరువాత వేళ్ళలో చిక్కులేకుండా విడదీసుకూవాలి. నల్ల మచల్లు ఉన్న పోగులను తీసివేయాలి.

2.నారను శుభ్రపరచడం:
నారను తీసిన తరువాత వాటిలో కొన్ని మలినాలు ఉంటాయి. ఈ మలినాలను వేరు చేసినట్లయితే నారకు రంగు బాగా పడుతుంది. డిటర్జంటు, సోడా, కాస్టిక్ కలిపినా నీటిలో ఒక గంటనార సేపు ఉడికిన్చినట్లయితే మలినాలు తొలగి నార శుభ్రంగా తయారవుతుంది.
నార : 1 కిలో
నీరు : 20 లీటర్లు
కాస్టిక్ : 1 గ్రా”/లీటర్
చాకలి సోడా : 2 గ్రా”/లీటర్
డిటర్జoట్ ( సర్ఫ్) : 2 గ్రా”/లీటర్

౩.శుభ్రపరిచిన గోగునారకు కరక్కాయ ట్రీట్మెంట్:
కరక్కాయ పొడిని ఒక గిన్నెలో కొద్దిగా నీటిని కలిపి మెత్తటి పేస్టు లాగా చేసుకోవాలి. గోగునార మరియు నీటి నిష్పత్తి 1:20 ఉండునట్లు నీటిని ఒక ప్లాస్టిక్ తోట్టెలోనికి తీసుకోవాలి. (అంటే సుమారు 1 కేజీ గోగునారకు, 200 గ్రాములు కరక్కాయ పొడి మరియు 20 లీటర్ల నీటిని తీసుకొనవలెను). ఇప్పుడు కరక్కాయ పేస్టు నీటిలో బాగా కలపవలెను. తరువాత గోగునారను సుమారు ఒక రోజు కరక్కాయ పొడి కలిపినా నీటిలో నానపెట్టవలెను. తరువాత నీటిని పిండి గోగునారను బాగా ఆరపెట్టవలెను.

4. కరక్కాయ ట్రీట్మెంట్ చేసిన గోగునారకు మోర్డెంటిoగ్ చేయుట:
కావలిసిన రంగులను బట్టి మోర్డెంటులను ఎంపిక చేసుకోవాలి. ఒకే సహజ రంగుతో వివిధ రకాలైన మోర్డెంటులు వివిధ రకములైన రంగులనిస్తాయి. పైన తెలిపిన విధంగా మోర్డెంటులు మోతాదులలో మోర్డెంటులను కలిపి నిర్దిష్టమైన రంగులను పొందవచ్చు. నీటిని గోరు వెచ్చగా వేడి చేసి మోర్డెంటు కలపాలి. ఇప్పుడు గోగునార బరువును బట్టి 1:20 నిష్పత్తిలో గోగునార మరియు నీటిని ప్లాస్టిక్ తోట్టెలో తీసుకోవాలి. ఈ నీటిలో సరైన మోతాదులో మోర్డెంటును వేసి బాగా కలపవలెను. తరువాత కరక్కాయతో ట్రీట్మెంట్ చేసిన గోగునారను వేసి సుమారు పావు గంట సేపు నానబెట్టాలి. తరువాత గోగునారను పిండి ప్రక్కన పెట్టుకోవాలి.
మోర్డెంటులు వాడవలసిన మోతాదులు
పటిక మోర్డెంటుగా వాడినప్పుడు :
నార : 1 కిలో
నీరు : 20 లీటర్లు
పటిక : 150 నుండి 200 గ్రా.వరకు
మైలుతుత్తం లేదా స్టానస్ క్లోరైడ్ లేదా ఫేర్రస్ సల్ఫేట్ లను మోర్డెంటులుగా వాడినప్పుడు:
నార : 1 కిలో
నీరు : 20 లీటర్లు
మోర్డెంటులు : 10 నుండి 30 గ్రా. వరకు

5) రంగు ద్రావణం తాయారు చేయుట :
కాలానుగుణంగా మనకు లభ్యమయ్యే ఆకర్షణీయమైన రంగులు గలిగిన మొక్కల యొక్క వివిధ భాగాలను సేకరించి, వాటిని పూర్తిగా తడి ఆరిపోయేలా నీడలా (ముఖ్యంగా పూలను) ఆరబెట్టి పొడిగా ఉన్న స్థలంలో విడివిడిగా భద్ర పరుచుకొంటే, అవసరమయ్యేటప్పుడు వాటి నుండి రంగులను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
పూలు, బెరడ్లు, గింజలు మొదలగునవి: 50 గ్రా. లా నుండి 100 గ్రా. వరకు
నీరు : 1 లీటరు
సేకరించిన మొక్కలు యొక్క భాగాలను చిన్న చిన్న మొక్కలుగా చేసుకోవాలి. వీటిని ఒక పూట రెండింతలు నీటిలో నానప్ర్ట్టాలి. ఈ విధంగా నానపెట్టడం వలన మొక్కల యొక్క భాగాలు నాని బాగా రంగు వస్తుంది. నానబెట్టిన నీటిని ఒక గంటసేపు తిప్పుతూ ఉడకబెట్టాలి.ఈ ప్రక్రియ మొక్కల యొక్క భాగాలను బట్టి మారుతుంది.
పూలు: పూల నుండి రంగును తీయాలని అనుకున్నట్లయితే వాటిని 20 నిమిషముల పాలు నీటిలో ఉడకబెట్టాలి. తరువాత వదపోయటం ద్వారా రంగు ద్రావణం పొందవచ్చు.
బెరాదులు, వేర్లు, చెక్క: బెరడు, వేర్లు మరియు చెక్కలు నుండి సహజ రంగులను పొందాలంటే ముందుగా వాతీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ,రాత్రంతా నీటిలో నానబెట్టవలెను . తరువాత గంటసేపు బాగా ఉడకబెట్టవలెను. చల్లారిన తరువాత వడకట్ట వలెను.
కాయలు, విత్తనములు : కరక్కాయలు వంటి ఎండబెట్టిన క్కయలను పొడి చేసుకొని ,తరువాత నీటిలో రాత్రంతా నానబెట్టి తరువాత గంటసేపు ఉడకబెట్టవలెను. చల్లారిన తరువాత వాడకట్టవలేను.
పైన తెల్పిన విధంగా కావాల్సిన రంగులను బట్టి వివిధ భాగాల నుండి సహజ రంగులను పొందవచ్చు.

6) నారకు రంగువేయుట:
మోర్డెంటు చేసిన న్నరను రంగు ద్రావణంలో ముంచి ముప్పావు గంట ఉడికించాలి . మరీ ఎక్కువ సెగ ఉండకూడదు.
నార : 1 కిలో
రంగుద్రావణం : 20 లీటర్లు
న్నరకు రంగు బాగా పట్టిన తరువాత ఆ నీటిలోనే నారను కొద్దిసేపు నాననివ్వాలి. ఇప్పుడు గోగునార రంగును బాగా పీల్చుకుంటుంది.

7) గోగునారను ఉతికి ఆరవేయుట :
తరువాత గోగునారను పిండి మంచినీటిలో కడిగి తరువాత కొద్దిగా డిటేర్జేంట్ సబ్బుతో ఉతికి నీటిలో బాగా జాడించి నీడలో ఆరవేయవలెను. ఈ విధంగా సహజ రంగులను అద్దిన తరువాత ఈ గోగునారతో జడలు అల్లి వివిధ రకములైన హస్తకళలు తయారు చేసుకొనవచ్చు.

Share this post


Watch Dragon ball super