రక్త హీనత

రక్త హీనత

మన శరీరం లోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్ అనే పదార్ధం. ఇది తయారవ్వడానికి మంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్ధం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పోక మోతాదులో ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరాల లోపు పిల్లలలో 11 గ్రాములు, గర్భిణి స్త్రీ లలో 11 గ్రాములు, బాలింతలలో 12గ్రాములు, 6 నుండి 12 సం. ల లోపు పిల్లలలో 12 గ్రాములు ఉండాలి. ఒక వేళ హిమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్తహీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు.

రక్త హీనత ఎవరిలో ఎక్కువగా కనబడుతుంది ?

గర్భిణి స్త్రీలు, బాలింతలు, 15-45 సం. వయస్సు గల స్త్రీలు, 11 సం. ల లోపు పిల్లలలో రక్త హీనత ఎక్కువగా ఉంటుంది. అయితే మగవారిలో కూడా రక్త హీనత చోటుచేసుకోవడం అసాధారణం కాదు.

నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, అలసట, చికాకు, ఆకలిలేకపోవడం, మైకం, కళ్ళు తిరగడం, అరచేతుల్లో చెమట, చేతుల గోళ్ళు వంగి గుంటలు పడటం, పాదాలలో నీరు చేరడం, చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి చూపించడం.

చాలా మంది మహిళలు రక్త హీనత తో భాధపడుతుంటారు. అలాంటి వారు కొత్తిమీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో ఇనుము శాతం ఎక్కువ. ఇది రక్త కణాల వృద్ధిని పెంచి, రక్తహీనతను దూరం చేస్తుంది. ఊపిరి సరిగ్గా అందక బాధపడేవారు ఉదయాన్నే కొత్తమీర రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

raktha-heenatha-1

బచ్చలి కూర మనకి ఆరోగ్యకరమైన పోషకాలనీ అందిస్తుంది. వంద 100గ్రా. ఆకుల నుంచి 19 కేలరీలు, 1.8 టీన్లు, 400 మై.గ్రా విటమిన్ –ఎ, 109 మి.గ్రా. కాల్షియం ఇంకా ఐరన్, పొటాషియం, సి- విటమిన్, ఇంకా ఇందులో కెరోటిన్, ల్యూటెన్, జియాక్సాంధిన్ వంటి యంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో ఈ ఆకులు కెన్సర్ కారకాల్ని, జీర్ణక్రియ సమస్యల్ని, బిపీనీ, మూత్రపిండం సమస్యల్ని కంటి జబ్బుల్ని కాలేయ వ్యాధుల్ని నిరోధిస్తాయట.

raktha-heenatha-2

రక్త హీనత రాకుండా గుమ్మడిraktha-heenatha-3

గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచు, విటమిన్ సి గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పోటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఎముకల సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండ ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడితో చేసిన వంటకాలు తినిపించడం ఎంతో మంచిది. విటమిన్ సి అందించే కూరగాయల్లో గుమ్మడి ఒకటి. ఇది శరీరం లో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్లు, ఇన్ ఫెక్షన్లు దూరమవుతాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయ్యడంతో ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది హాయిగా నిద్రపడుతుంది.

రక్తహీనతలో ఏమైనా రకాలున్నాయా:

పౌష్టికాహార లోప రక్తహీనత:

ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12, మాంసకృత్తులు ఆహారంలో లోపించినప్పుడు ఈ రకం రక్తహీనత ఏర్పడుతుంది. అందులోను సాధారణంగా మాంసకృత్తులు, ఇనుము లోపించటం ఉంటుంది.

ఉదయం నుండి రాత్రిదాకా ఇల్లు, ఆఫీసు పనులు, పిల్లల బాధ్యతలు అన్నిటిలో సతమతమవుతూ సరైన పోషకాహారం తీసుకోక చాలామంది మహిళలు రక్తహీనతకు గురై పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. మంచి పోషకాహార అవగాహనతో సరైన ప్రమాణంలో వీటిని తమ ఆహారంలో చేర్చుకోవాలి.

ఫోలిక్ ఆమ్లం లోపించినప్పుడు వచ్చే రక్తహీనతను మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. దీని లోపము గర్భవతులలో ఎక్కువగా కనబడుతుంది. అలాగే యాంటీబయోటిక్  మందులు ఎక్కువకాలం వాడే వారిలోను వస్తుంది.

విటమిన్ బి12 లోపం వలన వచ్చే రక్తహీనత: ఇది శాఖాహారంలో ఉండదు. మాంసాహారంలో మాత్రమే లభిస్తుంది. కాని బి12 ను ఉత్పత్తి చేసే బాక్టీరియా మానవుని ప్రేగులలో ఉండటం వలన శాఖాహారులకు కూడా విటమిన్ బి12 సరఫరా అవుతుంది. కాని యాంటీ బయాటిక్ మందులు వాడితే ఈ బి12 ఉత్పత్తి చేసే బాక్టీరియాను సంహరించి దాని లోపమును కలిగిస్తాయి. దీన్ని పెర్ నిషియస్ అనీమియా అంటారు.

అసలు రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయి:

 • రక్తహీనత వల్ల రోగి పాలిపోతారు. ఈ పాలి పోవడం గోళ్ళలోను, పెదవులలోను, నాలుకమీద, కంటి రెప్పలలోను తేలికగా గమనించవచ్చును.
 • ఆకలి తగ్గిపోతుంది.
 • జవసత్వములు తగ్గి త్వరగా అలసిపోతారు
 • శ్రమపడితే ఊపిరి సరిగా అందదు. గుండెలో దడ ఏర్పడుతుంది.
 • కళ్ళు తిరుగుతూ ఉంటాయి.
 • అరచేతుల్లో చెమటలు పట్టడం
 • చేతుల గోళ్ళు వంగి గుంటలు పడటం
 • పాదాలలో నీరు చేరడం
 • చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం వంటి లక్షణాలు స్పష్టంగా కనపడతాయి.

raktha-heenatha-4

రక్తహీనత వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి:

బలహీనత

 • గర్భిణీ మరియు బాలింత సమయంలో తగిన పోషకాహారం తీసుకోకపోవడం వలన గర్భస్రావం, తక్కువ బరువులో పిల్లలు పుట్టడం, పుట్టిన బిడ్డ లెదా తల్లి చనిపోవడం జరుగుతుంది.
 • గర్భిణీలు తక్కువ బరువు ఉండటం, రక్తహీనతకు గురి అవడం వలన ప్రసవ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 • పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది.
 • రోగాలు తేలికగా వెంటవెంటనే వస్తాయి.
 • పిల్లలు చదువులో వెనకబడతారు, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోతారు

రక్తహీనతను నివారించడం ఎలా:

చికిత్సా విధానం:

 • చిన్న పిల్లలకి పొట్ట పురుగుల మందు ఇవ్వాలి.
 • విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునే అలవాటు చేయాలి
 • యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయస్సు మధ్యలోగల స్త్రీలందరికి ఎ ఎన్ ఎం సహాయంతో ఉచితంగా లభ్యమయ్యే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలి.

raktha-heenatha-5

ఆహార చికిత్స

ముందుగా సమతులాహారాన్ని తీసుకుని రక్తహీనతను పారదోలవచ్చు. మాంసకృత్తులు, ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, సి సమృద్ధిగా లభిచేటువంటి ఆహారాలను భుజించాలి. విటమిన్ సి, ఇనుమును శరీరంలో శోషింపచేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఆకుకూరలు భుజించడం ద్వారా రక్తహీనతను సులువుగా అధిగమించవచ్చు. వీటిలో ఇనుము అధికంగా లభిస్తుంది. తృణధాన్యాలకు అనగా కొర్రలు, సజ్జలు వంటి వాటినుండి ఇనుము చక్కగా లభిస్తుంది. ఎండు ఫలాలు, అంజీర, ఖర్జూర, మాంసం, కాలేయం, పుచ్చకాయ, బఠాణీలు, అటుకులు భాగంగా చేసుకుంటే తప్పకుండా రక్తహీనతను అధిగమించవచ్చు.

మంచి ఆహారంతో రక్తహీనతకు దూరం:

ప్రస్తుతం మహిళల్ని వేధిస్తున్న సమస్య రక్తహీనత. లేచింది మొదలు పడుకునేంతవరకు పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయం ఎక్కడుంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ ఏం తింటాంలే అని ఊరుకునే మహిళలు ఎంతమందో. దీని ఫలితమే రక్తహీనత. తాజా కూరగాయలను, పాలకూర, క్యారెట్, బీట్ రూట్, టమాట, అరటిపండ్లు, ఆపిల్, ద్రాక్ష, ఆఫ్రికాట్లలోను ఇనుము లభిస్తుంది. విటమిన్ బి12 రక్తహీనతకు సహాయపడుతుంది.

రక్తహీనత బారిన పడకుండా ముందు జాగ్రత్తలు:

ఆహారంలో తగు మార్పులతో రక్తహీనతను నివారించవచ్చు

 • ప్రొటీన్లు, ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, సి లభించే ఆహారాలను తీసుకోవాలి.
 • భోజనం చేసిన వెంటనే కాఫీ, టీ తాగటం మానెయ్యాలి.
 • ముడి ధాన్యాలు తగు మోతాదులో ఉండాలి.
 • వయసు, ఎత్తుకు సరిపడా బరువుండేలా జాగ్రత్తపడాలి.
 • డైటింగ్, ఉపవాసం అంటూ బోజనం మానెయ్యకూడదు.
 • ప్రతిరోజూ ఆహారాన్ని 2 సార్లుగా కాకుండా సులువుగా జీర్ణమయ్యేలా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు(6సార్లు) తీసుకుంటే మంచిది.
 • వరి అన్నం, గోధుమలతో చేసిన వంటకాలతో పాటు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఓట్స్ వంటివి తీసుకుంటె పీచు, ఇనుము సమృద్ధిగా అందుతాయి. కాబట్టి మన ఆహారంలో వీటిని భాగంగా చేర్చుకోవాలి.

raktha-heenatha-6

ప్రొటీన్ల లోపం:

భారత దేశంలో ప్రొటీన్ లోపం సాధారణంగా ఉంటుంది. ప్రతి రక్తహీనత కేసులోను ఈ లోపం కనిపిస్తుంది. అందునా 1-6 సంవత్సరాల చిన్నపిల్లల్లో, కిషోర బాలికలలో సరైన పోషకాహారం లేక ఈ రక్తహీనత వస్తుంది. ఎదుగుదల చురుగ్గా ఉండే చిన్నపిల్లల్లో, కౌమార వయస్సులో ప్రొటీన్లు, ఇనుము ఆవశ్యకత అంతకంతకూ పెరుగుతుంది. కిషోరబాలికలు నాజూగ్గా ఉండాలని కోరుకుంటూ ఆహారం సరిగా తీసుకోవడం మానేస్తారు. దీనిని ఎనరోక్సియా నెర్వోసా అంటారు. వీరు తీవ్ర రక్తహీనతకు గురవుతారు. ఒక్కొక్కసారి రక్తహీనత మీరి తీవ్రమై రక్తప్రధానం చేయవలసి వస్తుంది.

రక్త నష్టం వల్ల కలిగే రక్తహీనత

అధిక ఋతుస్రావం ద్వారా, అపాయాలు, రక్తవాంతులు, జీర్ణాశయంలో అల్సర్ల వలన, కాలేయ సమస్యలలో అధిక రక్తస్రావం జరిగి రక్తహీనత వస్తుంది. కొంకి పురుగులు పేగులనుండి రక్తము పీల్చి రక్తహీనత వచ్చినపుడు తప్పక డాక్టరును సంప్రదించి సంపూర్ణ చికిత్స తీసుకోవాలి.

రక్తం తయారీలో అవరోధం వలన వచ్చే రక్తహీనత:

మలేరియా వల్ల రక్తంలోని ఎర్ర రక్తకణాలు ధ్వంసం అయి మరలా పెరగవు. దీంతో రక్తం తయారవక రక్తహీనత ఏర్పడుతుంది.

ప్రభుత్వ పథకాలు

గర్భిణీ మరియు బాలింత సమయంలో తగిన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే రక్తహీనతను అధిగమించడానికి ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ప్రవేశపెట్టింది.

గర్భిణీ మరియు బాలింతలు పూర్తి ఆరోగ్య స్థాయిలో ఉన్నపుడు జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా మాతా శిశు మరణాల రేటు, తక్కువ బరువుతో జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించగలమనే ముఖ్య ఉద్దేశ్యముతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమం కింద నిరుపేద గర్భిణీ మరియు బాలింతలకు ఒకపూట పూర్తి భోజనం ప్రభుత్వం అందిస్తున్నది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఐ సి డి ఎస్ పథకం ద్వారా అన్ని అంగన్ వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం మొదలైంది.

raktha-heenatha-7

Uday Lakshmi.K
Teaching Associate,
Department of FDNT,
C.H.Sc, ANGRAU,
Guntur.

Share this post


Watch Dragon ball super