రాగి వంటకాలు

రాగి వంటకాలు

రాగి రొట్టె

కావలసిన పదార్థాలు :

రాగి పిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగ పొడి – ¼ కప్పు
తరిగిన ఉల్లిపాయలు – 1
నూనె – 2 టేబుల్ స్పూన్లు
క్యారెట్ తురుము – కొద్దిగా
పచ్చి మిర్చి – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు- తగినంత

తయారు చేసే విధానం :

మొదటగా రాగి పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానికి బియ్యం పిండి, వేరుశనగ పలుకుల పొడి, తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె అన్ని నీటితో బాగా కలపాలి. తరువాత ఒక పాలిథీన్ పేపర్ పైన  నూనెను రాసి దాని పైన రాగి రొట్టెను చెయ్యాలి. ఆ రొట్టెను  పెన్నం పైన రెండు వైపుల బాగా కాల్చాలి. ఈ రాగి రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ragi-vantakaalu-14


రాగి వడ

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు
అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్
పుదినా పేస్ట్ –1 టీ స్పూన్
కొత్తిమీర పేస్ట్ –1 టీ స్పూన్
పచ్చి మిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్
జిలకర్ర – 1 టీ స్పూన్
పచ్చి కొబ్బరి పేస్ట్ – 1 టీ స్పూన్
తరిగిన ఉల్లిపాయ – 1
కరివేపాకు – రెండు రెమ్మలు
గరం మసాలా – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత

తయారు చేసే విధానం:

రాగి పిండిని ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఆ పిండికి పుదినా పేస్ట్, కొత్తిమీర పేస్ట్, అల్లం పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, జిలకర్ర, పచ్చి కొబ్బరి పేస్ట్, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, గరం మసాలా, ఉప్పు అన్ని వేసి వడ వేసుకోవడానికి తగిన రీతిలో కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న వడలు చేసి కాగిన నూనెలో వెయ్యాలి.అవి చక్కగా కాలిన తర్వాత తీసివేయాలి. ఇప్పుడు రుచికరమైన వడలు తయారైనట్లే.
ragi-vantakaalu-12


రాగి సమోసా

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు
నెయ్యి – 3 టీ స్పూన్లు
ఉడకబెట్టిన బంగాళదుంప -3
ఉల్లిపాయలు – 1
పచ్చి బఠాణీలు -3 టీ స్పూన్లు
మిరియాల పొడి -1 టీ స్పూన్లు
ఉప్పు- తగినంత
నూనె- తగినంత

తయారు చేసే విధానం:

రాగి పిండి, నెయ్యి, ఉప్పుని ఒక గిన్నెలో తీసుకొని నీటితో కలిపి ముద్దలు చేసుకోవాలి. తరువాత ఉడకబెట్టిన బంగాళదుంపలను తొక్క తీసి మెత్తగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరగాలి. కొంచం నూనెను వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. దీనికి బంగాలదుంపలు, మిరియాల పొడి, ఉప్పు అన్ని వేసి బాగా కలపాలి.తరువాత తగినంత నూనెను బాండిలో తీసుకొని వేడిచేయాలి. ఇప్పుడు రాగి పిండిని చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రటి ఆకారంలో తిక్కి ,దానిని రెండుగా కట్ చేసుకోవాలి, ఇప్పుడు కట్ చేసిన ఒక దానిని తీసుకొని త్రీకోణాకారంలో మలచాలి. మలచిన తరువాత బంగాళదుంప కూరను దానిలో పెట్టి చక్కగా పైన అతికించాలి. తరువాత వీటిని కాచిన నూనెలో వేసి వేడి అయిన తరువాత తీసివేయాలి. ఇంకా రుచికరమైన రాగి సమోసా తయారైనట్టే.
ragi-vantakaalu-13


రాగి పాలకూర కబాబ్

కావలసిన పదార్థాలు:

సన్నగా తరిగిన పాలకూర – ½ కప్పు
సన్నగా తరిగిన క్యాబేజ్ – ½ కప్పు
రాగి పిండి – 1 కప్పు
శనగ పిండి – ¼ కప్పు
తరిగిన పచ్చిమిర్చి – 5
తరిగిన అల్లం – చిన్నముక్క
పసుపు – చిటికెడు
కారం – 1టీ స్పూన్
పంచదార – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

రాగి పిండి, శనగ పిండి, పాలకుర, క్యాబేజ్, పచ్చి మిర్చి , అల్లం, పసుపు, కారం, పంచదార, ఉప్పు అన్ని ఒక గిన్నెలో తీసుకొని నీటితో ఒక ముద్దలో కలపాలి. ఆ ముద్దను వేలి పొడవంత ముక్కలుగా చేసుకొని ఆవిరి పట్టించి ఒక పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత, వాటిని బాగా కాచిన నూనెలో వేడి చేయాలి. అది బాగా కాలిన తరువాత తీసేయాలి. ఇప్పుడు రాగి పాలకూర కబాబ్ తయారైనట్లే.
ragi-vantakaalu-11


రాగి సూప్

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – ½ కప్పు
క్యారెట్ – 1
సన్నగా తరిగిన క్యాబేజ్ – ¼ కప్పు
బీన్స్ – 10
ఉల్లిపాయలు (పెద్దవి) – 2
క్యాప్సికం – 1
టమోటా – 1
కరివేపాకు -1 రెమ్మ
అల్లం – 2 చిన్న ముక్కలు
వెల్లుల్లి- 4 రేకలు
మిరియాలపొడి – తగినంత
ఉప్పు- తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, క్యాప్సికం, వెల్లుల్లి, అల్లం అన్ని సన్నగా తరగాలి. తరువాత టమోటోను మెత్త గుజ్జులా చెయ్యాలి. బాండిలో నూనెను పోసి బాగా వేడి చెయ్యాలి. కాగిన నూనెలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చెయ్యాలి. కూరగాయలు బాగా ఉడికిన తరువాత రాగి పిండి నాలుగు కప్పుల నీరు వేసి పిండి బాగా ఉడికేంతవరకు ఆపకుండా కలపాలి. తరువాత తగినంత ఉప్పు , మిరియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు రాగి సూప్ తయారయిపోయింది.
ragi-vantakaalu-3


రాగి డోక్ల

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – ¼ కిలో
పెరుగు – 1 కప్పు
పచ్చి మిర్చి – 4
అల్లం – చిన్న ముక్క
సోడా – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
నిమ్మకాయ – 1
కరివేపాకు – కొద్దిగా
జీడి పప్పు – 10
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

2 పచ్చి మిర్చీలు,చిన్న అల్లం ముక్కను కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. జీడిపప్పును చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత రాగి పిండి, పెరుగు, ఉప్పు, మిర్చి అల్లం పేస్ట్, నిమ్మకాయ రసం అన్ని ఒక గిన్నెలో వేసి కలుపుకొని 2 గంటల పాటు ఉంచుకోవాలి. దానికి సోడాను వేసి బాగా కలిపి ఒక ప్లేటులో వేసి ఆవిరి పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అది చల్లారిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత తగినంత నూనెను కడాయిలో తీసుకొని వేడి చేసి ఆవాలు, 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి పోపు తయారు చేసుకోవాలి. దీనిని రుచి కోసం మనం చేసిన డొక్లకి కలుపుకోవాలి.
ragi-vantakaalu-2


రాగి బొండా

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు
శనగ పిండి – ¼ కప్పు
కారం – ½ టీ స్పూన్
సోడా – చిటికెడు
ఉడకబెట్టిన బంగాళదుంప – 2
ఉల్లిపాయలు – 1
పచ్చి మిర్చి – 2
అల్లం – చిన్న ముక్క
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – కొద్దిగా
ఇంగువ – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

మొదటగా రాగి పిండి, శనగ పిండి, కారం, ఉప్పు, వంటసోడా, ఇంగువ అన్నిటిని నీటితో కలిపి పిండిల చేసుకోవాలి. బంగాళదుంపలకు తొక్కతీసి మెత్తని గుజ్జుల చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరగాలి. పచ్చి మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా నూనెను వేడి చేసి డానికి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కొన్ని నిమిషాలు ఫ్రై చెయ్యాలి. అల్లం పచ్చి మిర్చి, బంగాళదుంప గుజ్జు , ఉప్పు , వేసి బాగా కలపాలి. చల్లారిన తరువాత వాటిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత తగినంత నూనెను బాండిలో తీసుకొని వేడి చేసి ఉండలను బంగారు రంగు వచ్చే దాకా కాల్చాలి.
ragi-vantakaalu-1


రాగి కట్లెట్

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 1 కప్పు
మునగ ఆకులు – చేతినిండా
సోప్ – 2 టీ స్పూన్లు
పసుపు – ¼ టీ స్పూన్
ఉల్లిపాయలు (చిన్నవి) – 10
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – 6 రేఖలు
గరం మసాలా పొడి – 1 టీ స్పూన్
బ్రెడ్ ముక్కలు – ¼ కప్పు
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

ఉల్లిపాయ, సోప్ , అల్లం, వెల్లుల్లి అన్ని కలిపి పేస్ట్ ల చేసుకోవాలి. రాగి పిండి, మునగ ఆకులు, కరివేపాకు, మిక్సి చేసుకున్న పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు అన్ని ఒక గిన్నెలో తీసుకొని నీటితో ఒక ముద్దల కలుపుకోవాలి తరువాత కలుపుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని బ్రెడ్ ముక్కలలో ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో నూనెను వేడి చేసి , చేసుకున్న ముక్కలను నూనెలో వేసి ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు రాగి కట్లెట్ తయారైనట్లే.
ragi-vantakaalu-10


రాగి పుట్టు

కావలసిన పదార్థాలు:

రాగి పుట్టు పిండి – 2 కప్పులు
తురిమిన కొబ్బరి – ½ కప్పు
యాలుకలు – 4
పంచదార – ½ కప్పు

తయారు చేసే విధానం:

మొదటగా రాగి పుట్టు పిండిని ఇడ్లి కుక్కర్లో ఆవిరితో ఉడికించాలి. తరువాత దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకొని, పంచదార, యాలుకలు పొడి, తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. దీనిని మనకు కావలసిన ఆకారంలో వేస్కోవచ్చు. ఇప్పుడు రాగి పుట్టు తయారైనట్టే.
ragi-vantakaalu-8


రాగి ముద్ద

కావలసిన పదార్థాలు:

రాగి – 1 కప్పు
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

1.5 టీ స్పూన్ రాగి పిండి, 2 టీ స్పూన్ల నూనె , ఉప్పు, 1.5 కప్పు నీళ్ళల్లో కలిపి ఒక గిన్నెలో బాగా ఉడకబెట్టాలి. తరువాత మిగిలిన పిండిని కూడ వేసి ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. తరువత మూత పెట్టి చిన్న మంటలో 1-2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపాలి. ఇప్పుడు చేతులని తడి చేసుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే రాగిని ముద్దలుగా చేసుకోవాలి. ఇంకా రుచికరమైన రాగి ముద్దలు తయారైనట్లే.
ragi-vantakaalu-5


రాగి వడియాలు

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 2 కప్పులు
పచ్చి మిర్చి – 3
ఉప్పు – 1 టీ స్పూన్
జిలకర్ర – 1 టీ స్పూన్

తయారు చేసే విధానం:

పచ్చి మిర్చి, ఉప్పు, రెండు కలిపి పేస్ట్ ల చేసుకోవాలి. దిన్ని జిలకర్రతో ఉడకబెట్టిన కప్పు నీటిలో వేసి వేడి చెయ్యాలి. వేడి చేసిన నీటిని రాగి పిండితో బాగా కలపాలి. ఆ పిండిని మనకు కావాల్సిన ఆకారాలలో వేసుకోవచ్చు. తరువాత వాటిని ఎండలో ఎండబెట్టి, భద్రపరచుకోవాలి. కావాల్సినప్పుడు నూనెలొ వేసుకొని తినొచ్చు. ఇవి అన్నతో నంచుకొని తినడానికి చాల బాగుంటాయి.
ragi-vantakaalu-4


రాగి ఇడ్లి

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 2 కప్పులు
ఇడ్లి రవ్వ – 1 కప్పు
మినపప్పు – ½ కప్పు
మెంతులు – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత

తయారు చేసే విధానం:

మినపప్పును నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండి, ఇడ్లి రవ్వ, ఉప్పు కలిపి ఒక రాత్రి పులియబెట్టాలి. పిండిని బాగా పలచగా కలిపి ఇడ్లి వేసుకోవచ్చు. ఇవి బియ్యపు రవ్వ ఇడ్లిలాగే రుచిగా ఉంటాయి.
ragi-vantakaalu-7


రాగి దోసె

కావలసిన పదార్థాలు:

ఉప్పుడు బియ్యం – 1 కప్పు
మినపప్పు – ½ కప్పు
సగ్గుబియ్యం – ¼ కప్పు
రాగి పిండి – 1 కప్పు
మెంతులు – ¼ టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం, కలిపి 4-5 గంటల వరకు నానబెట్టాలి. అలాగే మినపప్పు మెంతులు కలిపి 3-4 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యంను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టిన మినపప్పు, మెంతుల్ని కూడా మెత్తగా రుబ్బుకొని ఆ పిండిని ఒక గిన్నలో వేసుకొని, దానిలోనే రాగి పిండి తగినంత ఉప్పు వేసి బాగా కలుపి మూత పెట్టాలి. పిండిని పులియబెట్టి, దోసెలు వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాల రుచిగా ఉంటాయి.
ragi-vantakaalu-6


రాగి హల్వా

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 35 గ్రా.
బెల్లం – 20 గ్రా.
వేరుశనగ – 25 గ్రా
పండిన బొప్పాయి కాయ – 15 గ్రా.
నీరు – 50 మీ.లీ

తయారు చేసే విధానం:

మొదటగా రాగి పిండిని వేయించుకోవాలి. తరువాత వేరుశనగలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లంలో నీటిని కలిపి ఉడకబెట్టి పాకంలాగ చేసుకోవాలి. వేయించిన రాగి పిండిని, వేరుశనగ పిండిని, బొప్పాయ్ గుజ్జును పాకంలో వేసి కొద్దిసేపు ఉడకబెట్టాలి. దీనికి మనం కావాలనుకుంటే జీడిపప్పును హల్వాపైన వేసుకోవచ్చు.


రాగి పకోడీ

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 2 కప్పులు
బియ్యం పిండి – 1 కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చి మిరపకాయలు – 4
అల్లం – చిన్న ముక్క
వేరుశనగలు – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
కరివేపాకు – రెండు రెమ్మలు
నూనె – తగినంత

తయారు చేసే విధానం:

ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను సన్నగా తరుగుకోని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా నూనె అన్నివేసి నీటితో పకోడీలు వేసుకొనే విదంగా బాగా కలుపుకోవాలి. తర్వాత నూనెను బాగా కాగబెట్టి అందులో ఈ పిండితో పకోడిలాగ వేసి బాగా ఫ్రై అయ్యాక తీసేయాలి. వీటిని రుచికరమైన స్నాక్స్ గా తీసుకోవచ్చు.
ragi-vantakaalu-9

Share this post


Watch Dragon ball super