ప్రాక్ ప్రాధమిక విద్య- ఆవశ్యకత

ప్రాక్ ప్రాధమిక విద్య- ఆవశ్యకత

ప్రాక్ ప్రాధమిక విద్య: 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆటపాటల ద్వారా ప్రాధమిక విద్యకు సంసిద్దులను చేస్తే వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడాన్ని ప్రాక్ ప్రాధమిక విద్య అని అంటారు. ఈ ప్రాక్ ప్రాధమిక విద్య ప్రాక్ ప్రాధమిక పాఠశాలల ద్వారా పిల్లలకు ఇవ్వబడుతుంది.

ప్రాక్ ప్రాధమిక పాఠశాల ముఖ్య ఉద్దేశాలు: 3-6 సంవత్సరాల వయస్సు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటం అంటే పిల్లల శారీరక, సాంఘీక, ఉద్వేగ, భావన మరియు మానసిక అభివృద్ధిని పెంపొందించడం.
prak-pradhamika-vidya-aavasyakata-21. 3-6 సంవత్సరాల వయస్సు పిల్లల శారీరక అభివృద్ధిని, కండర సమన్వయం మరియు కాళ్ళు చేతులు నైపుణ్యాల అభివృద్ధిని పెంపొందించడం.
2. పిల్లలకు మంచి ఆరోగ్య సూత్రాలను, అలవాట్లను నేర్పించి, వారు స్వతంత్రంగా తినడం, దుస్తులు వేసుకోవడం, తల దువ్వుకోవడం మొదలైన పనులను తామే చేసుకోవడాన్ని నేర్పించి ప్రోత్సహించడం.
3. పిల్లల్లో మంచి సాంఘీక అలవాట్లను పెంపొందించి నలుగురిలో కలిసిమెలిసి ఉండటం, పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం మొదలైన అలవాట్లను నేర్పించడం.
4. పిల్లల తమ ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడాన్ని సరైన పద్ధతిలో బహిర్గతం చేయడాన్ని ప్రొత్సహించడం.
5. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించి ప్రకృతిలోని సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలో తేలియజేయడం.
6. పిల్లల్లో తమ చుట్టూ ఉన్న వాతావరణంలోని విషయాలను తెలుసుకోవాలి అని కుతూహలాన్ని పెంపొందించడం
7. పిల్లలు తమలోని భావాలను అంటే సృజనాత్మకతని బహిర్గతం చేయడాన్ని ప్రోత్సహించడం.
8. పిల్లలు తమలోని ఆలోచనలను, భావాలను సరైన స్పష్టమైన భాషలో వెల్లడించడాన్ని ప్రోత్సహించడం
9. పిల్లల్లో పాఠశాల ఉపాధ్యాయులపై సరైన మంచి అభిప్రాయం ఏర్పడేటట్లు చేయడం.

ప్రాక్ ప్రాధమిక విద్య ఆవశ్యకత:

ప్రాక్ ప్రాధమిక విద్య పాఠశాలల అవసరం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి అనేక నర్సరీ పాఠశాలలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీటి ఆవశ్యకత ఎక్కువైనవి కాని దురదృష్టవశాత్తు ఈ పాఠశాలలు చాలా వరకు నర్సరీ పాఠశాల విద్యా విధానం యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవడం లేదు, చాలా పాఠశాలలు మిగతా పాఠశాలలలాగే విద్యను బోధిస్తున్నాయి. ఇలా చేయడం చాలా తప్పు ఎందువల్ల అంటే 3-6 సంవత్సరాల వయస్సు పిల్లల అవసరాలు వేరు అందువల్ల వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడి వారిలో అభివృద్ధిని ఉత్తేజపరచడానికి అనువైన విద్యా విధానం ఎంతైనా అవసరం.

3-6 సంవత్సరాల వయస్సు వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఎందువల్ల అంటే ఈ వయస్సులో అభివృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలకు అర్ధం అయ్యే విధానంలో ఏమి చెప్పినా ఎంతచెప్పినా పిల్లలు గ్రహించగల్గుతారు చాలా కుటుంబంలో పిల్లలకు ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఇవ్వలేకపోతున్నారు.

దీనికి కారణాలు

prak-pradhamika-vidya-aavasyakata-3తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధికి దోహాదం చేసే కార్యక్రమాలు ఎలా ఇవ్వాలో తెలియదు అంతేకాక కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలపై ఉత్తేజకరమైన వాతావరణం యొక్క ప్రభావం ఏమిటో తెలియదు. ఈ వయస్సులో పిల్లలకు ఎంత ఉత్తేజకరమైన వాతావరణం ఇస్తే పిల్లల అభివృద్ధి అంత చురుకుగా జరుగుతుంది. ఈ వయస్సులో పిల్లలు ఉత్తేజకరమైన వాతావరణం నుంచి పొందే లాభం మరే వయస్సులోను పొందలేరు.

ఈ వయస్సులో ఏమి నేర్చుకున్నా అది పిల్లల మనస్సులో బాగా హత్తుకొనిపోతుంది. నేర్చుకున్న విషయాలను తొందరగా మర్చిపోలేరు కాబట్టి పిల్లలకు మంచి అనుభవాలను ఇచ్చి వారిలో మంచి అలవాట్లు పెంపొందించడానికి, మంచి అభిప్రాయాలు ఏర్పడడానికి, అడిగి ప్రశ్నించి తీసుకొనే శక్తిని పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతర పెద్దలు దోహదం చెయ్యాలి. ఈ నర్సరీ విద్య అభ్యసించడం వల్ల పిల్లలు ప్రాధమిక విద్య వాతావరణానికి తేలికగా అలవాటుపడ్తారు అందువల్ల 1,2 తరగతులలో స్కూల్ మానేయడం చాలామట్టుకు తగ్గించవచ్చును, ఎందువల్లనంటే నర్సరీ విద్యను అభ్యసించిన పిల్లలు స్కూలు వాతావరణానికి తొందరగా, సులభంగా అలవాటుపడ్తారు. అంతేకాక నర్సరీ కార్యక్రమాల వల్ల పిల్లల ఏకాగ్రత పెరిగి వారిలో కండరసమన్వయం బాగా అభివృద్ధి చెందడం వల్ల పిల్లలకు చదవడం, వ్రాయడం, నేర్చుకోవడం సులభం అవుతుంది అంతేకాక పిల్లలలో నర్సరీలో ఆడడం వల్ల సాంఘీక సర్ధుబాట్లు సులభం అవుతాయి, తన ఉద్వేగాలను అదుపులో ఉంచుకొనగల్గుతారు.

prak-pradhamika-vidya-aavasyakata-5ప్రస్తుతం నర్సరీలు సాంఘీక అవసరంగా తయారయ్యాయి ఆర్ధిక పరిస్థితుల వల్ల చాలామంది స్త్రీలు నేడు ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆర్ధికంగా తోడ్పడుతున్నారు. అర్బనైజేషన్ వల్ల ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు అంతరించి వాటి స్థానం ఏక కుటుంబాలు వచ్చాయి. అందువల్ల స్త్రీలు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు నర్సరీలు, డే కేర్ సెంటర్ లు పిల్లల అవసరాలను తీరుస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.

జనాభా పెరుగుదల వల్ల ప్రస్తుతం పట్టణాలలో ఇళ్ళు చాలా ఇరుగ్గా ఉంటున్నాయి. పిల్లలు ఆడుకోవటానికి ఇంటి దగ్గర అనువైన స్థలం ఉండటం లేదు. ఈ వయస్సు పిల్లలు స్వేచ్చగా ఆడుకోవడానికి, పరిసరాలను పరిశీలించి చూసి తెలుసుకోవడానికి అవకాశాలు ఉండటం లేదు. ఈ అవసరం పిల్లలు ప్రాక్ ప్రాధమిక పాఠశాలలకు వెళ్తే అక్కడ అనువైన ఆట వస్తువులు, విశాలమైన స్థలం ఉండటం వల్ల తీరుతుంది.

మన భారతదేశంలో చాలా మంది తల్లుల నిరక్షరాస్యులు అవ్వడం వల్ల పిల్లలను ఏ విధంగా ఉత్తేజపరచాలో తెలియదు, చదువుకున్న తల్లులకు చాలా మంది ప్రాక్ ప్రాధమిక వయస్సు ఆవశ్యకత మీద అవగాహన లేదు వారు పిల్లలను అస్సలు పట్టించుకోరు లేదా మరీ చిన్న పిల్లలుగా చూస్తారు. అందువల్ల బాగా చదువుకున్న కుటుంబాలలో కూడా పిల్లలకు అనువైన వాతావరణాన్ని ఏర్పరచలేరు.

prak-pradhamika-vidya-aavasyakata-6బాగా తర్ఫీదు పొందిన, అనుభవం గల నర్సరీ టీచర్లు ఈ సమస్యను పరిష్కరించగల్గుతారు. నర్సరీ టీచర్లు తల్లిదండ్రుల సహాయంతో పిల్లల అభివృద్ధిలో మంచి ఫలితాలను చూపించవచ్చును. పిల్లలు ఇతర పిల్లలతో ఆడడానికి చాలా ఇష్టపడ్తారు 2 1/2 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఇంటి వాతావరణం కంటే స్నేహితులతో కలిసి ఉండే వాతావరణాన్నే ఇష్టపడ్తారు. ప్రాక్ ప్రాధమిక పాఠశాలల్లో పిల్లలు ఇతర పిల్లలతో కలసి ఆడతారు కాబట్టి వస్తువులను పంచుకోవడం నేర్చుకుంటారు, తమ వంతు వచ్చేంత వరకు ఆగడం నేర్చుకుంటారు, ఇతర పిల్లలతో కలిసి మెలిసి ఆడటం వంటి సాంఘీక నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు.

పై విషయాలన్ని నర్సరీ లేదా ప్రాక్ ప్రాధమిక విద్య అవశ్యకతను తెలుపుతున్నాయి.

Share this post


Watch Dragon ball super