పెరటి ఔషధ మొక్కలు

పెరటి ఔషధ మొక్కలు

“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నది నానుడి. అందువల్ల మానవునికి అన్నింటికంటే తాను ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. పూర్వంవైద్యసౌకర్యాలుఅందుబాటులోఉండేవి కావు అంతేకాక ఆదినుండి మనది గ్రామీణ ప్రధాన దేశం కనుక ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్యరక్షణకై పరిసరాలలోప్రకృతి సిద్ధంగా లభించే మొక్కల పై ఆధారపడేవారు.

మన దేశంలో వేలల్లో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళకు ఈ మొక్కల గురించిన పరిజ్ఞానము, వంటింటి చిట్కాలతో చేసే గృహ వైద్యము తెలిసి ఉండేది. ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉండే మొక్కలను, సముచిత రీతిలో వినియోగించుకుంటే సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90 శాతం మేరకు రాకుండా చూసుకోవచ్చు. మొక్కల వివిధ భాగాలను అంటే వేరు , బెరడు, ఆకు, పువ్వు, గింజలను కాషాయం, రసం, చూర్ణం,తైలం మొదలైన రూపాలలో తయారు చేసి ఔషధంగా తీసుకుంటారు. ఈ విధంగా తయారు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.

ఆకులు, బెరడుతో రసం తీసేటప్పుడు వాటిని శుభ్రంగా దంచి నీళ్ళలోకలిపి, పిండి వడ కట్టాలి,.చూర్ణంగా వాడేటప్పుడు మెత్తగా దంచి జల్లెడ లేదా పలుచని బట్టలోవేసి జల్లించి గాలి చొరబడని సీసాలో పోసి మూత పెట్టాలి. చూర్ణాన్ని తేనె/నెయ్యి/ పాలతో తీసుకోవాలి. తైలాన్ని తయారు చేసేటప్పుడు ఆయా రసాలను సమ పాళ్ళలోతీసుకోని తైలాలతో కలిపి నీరు ఇంకెంత వరకు మరగబెట్టాలి.

ఔషధ మొక్కలు పెరటి మొక్కలుగా పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. పెరట్లో పెంచగలిగే ఔషధ మొక్కలను, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

తులసి:
తులసి కుండీలలోనైన సులువుగా పెంచగలిగే మొక్క. సర్వరోగ నివారిణిఅని పేరుంది.తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా,వగరుగా ఉంటాయి. కానీ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.తులసి ఆకులను పరగడుపున కొన్నిరోజుల పాటు 2-3 ఆకులను నమిలినట్లైతే ముక్కు దిబ్బడ వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధకశక్తి కలుగుతుంది.
perati-oushada-mokkalu-1

కలబంద(అలోవేర):
కలబంద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గుబురుగా పెరిగే మొక్క. కుండీల్లోను, నేలపైన పెంచుకోవచ్చు. కలబంద ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది, గుజ్జులో సుమారు 20 రకాల ఎమైనోయాసిడ్, కార్బోహైడ్రేట్లు మరియు ఇతర రసాయ బార్భాలోయిస్ అనే గ్లూకోసైడులు ఉంటాయి.

కలబంద ఆకులను మెత్తగా నూరి రసం తీసి దానిని పుండ్లు, కురుపులపై లేపనంగా వాడచ్చు. కలబంద బాగాముదిరిన ఆకులను తీసుకోని వాటిని చీల్చి గుజ్జు లాంటి పదార్ధానికి చిటికెడు ఉప్పు పసుపు కలిపి 15 రోజుల పాటురోజుకి ఒక్కసారి చొప్పున తీసుకుంటే జీర్ణకోశంలోని సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
perati-oushada-mokkalu-2

పుదీనా:
పుదీనా కుండీలలోను, నేలపైన అల్లుకొని పెరుగుతుంది. 10-15 ఆకులను ఒక గ్లాసు నీటిలో ఉడికించి, వడగట్టి, చల్లార్చి, దానికి చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి రోజుకి ఒకసారి తీసుకోవాలి. కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు తగ్గుతాయి. ఎండా కాలంలో వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి.
perati-oushada-mokkalu-3

మందార:
మందార కుండీలలోను, నేలపైన పెరుగుతుంది. మందార పువ్వులు, ఆకులు వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాలేయ సమస్యల నుండి ఉపశమనం కొరకు రక్తపోటు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఆకులు, పువ్వులతో తలపై మర్దన చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తల నొప్పి తగ్గుతుంది.
perati-oushada-mokkalu-4

కర్పూర వల్లి:
ఆకులను ముక్కు,గొంతు సమస్యలకు చికిత్స కు ఉపయోగిస్తారు.చర్మ వ్యాధులు,ఆస్తమా వంటి సమస్యలకు మంచి ఔషధం.
perati-oushada-mokkalu-5

కాకర:
కాకర తీగను సులువుగా నేలపైన, కుండీలలోను పెంచవచ్చు. రుచికి చేదుగా ఉన్నప్పటికీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.కాకర రసం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది. మధుమేహం గలవారు ప్రతిరోజు కాకర రసం తాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
perati-oushada-mokkalu-6

బొప్పాయి:
బొప్పాయి లో అధికంగా పీచు ఉండటం వలన క్రొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో క్రొవ్వును దగ్ధము చేయ్యగల ఎంజైములు ఉండటం వలన గుండె పోటు రాకుండా చేస్తుంది. బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణకోశం లోని పురుగులు నశిస్తాయి. మలబద్ధకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది. ‘ఎ’,’సి’ విటమిన్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
perati-oushada-mokkalu-7

జామ:
పెరటి లో నేల మీద పెంచగలిగిన దీర్ఘకాలిక వృక్షం. దీని ఆకులలో ఔషధ గుణాలు, పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.రోజుకి 2,3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది.చెట్టు బెరడు నుండి తీసిన కషాయం సూక్ష్మ జీవులను నశింపజేస్తుంది.ఆకుల నుండి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తుంది. ఆకులతో తయారైన మందులు డయేరియా కు మంచి ఫలితాన్నిస్తాయి.
perati-oushada-mokkalu-8

Share this post


Watch Dragon ball super