పర్యావరణాన్నిరక్షిద్దాం

పర్యావరణాన్నిరక్షిద్దాం

paryavaranaanni-rakshiddam-1పర్యావరణాన్ని పరిరక్షించాలంటే సామాజిక ఉద్యమం నేడు చాల అవసరం. ఇప్పటికే భూగోళ వాతావరణం బాగా దెబ్బతిని ప్రమాద పరిస్థితికిచేరిందని ప్రముఖ పర్యావరణ వేత్తలు అంటున్నారు. భూగోళం పై వేడి ఎక్కువగా పెరిగినందువల్ల ముఖ్యంగా ఆసియా ఖండానికి నష్టం జరుగుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వరి పంట తగ్గిపోవడం, సముద్రపు నీరు పొంగి అనేక ప్రాంతాలలో ఎక్కువ మోతాదులో నీరు చేరడం వంటివన్నీ భూగోళ ఉపరితలం పై వేడి ఎక్కువ అయినందువల్లనే సంభవిస్తున్నాయని ఎషియన్డెవలప్మెంట్బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది, సముద్రపు నీటిమట్టం పెరగడంవల్ల ఇండోనేషియా ఆర్చిపెలాగోలోని చిన్న ద్వీపాల సముదాయం సరిహద్దులు, మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడబోతున్నది. ఈ మార్పులు రాబోయే శతాబ్ధంలో సంభవించనున్నాయని, అందువల్ల ఆసియా దేశాలు వరద ప్రమాదాలనుంచి రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేయ్యాలని, నీటివనరులు విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుని వృద్ధి చేసుకోవాలని ప్రపంచబ్యాంకు సంస్థ కొన్ని సూచనలను చేసింది.

ప్రపంచ బ్యాంకు నివేదిక తయారుచేసిన వారిలో జోహాంగ్ జువాంగ్ అనే ఆర్ధిక శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ “మా అంచనా ప్రకారం సముద్రమట్టం 70 సెంటిమీటర్లు(28 అంగుళాలు) వరకుపెరుగుతుంది. దీనివల్ల మిలియన్ల ప్రజలు తమ నివాసాలను వదిలి వేరేచోట నివాసాలను ఏర్పరచుకోవలసిన పరిస్థితి రావచ్చు”అని అన్నారు.

paryavaranaanni-rakshidda-2ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వర్షపు నీరు భూమిలోనికి ఇంకిన తర్వాత పల్లపు వాలుగా ప్రవహిస్తుంది. అదే విధంగా సముద్రపు జలాలు కూడా భూమి పొరలలోనికి ప్రవహించడానికి ప్రయత్నిస్తాయి. అంటే సముద్ర తీరానికి లోతట్టు ప్రాంతంలో కొంతమేర భూమివైపు మంచినీరు, అటువైపు నుంచి సముద్రపు నీరు కలుస్తాయి. భూగర్భ జలాలను ఎక్కువగా పంపులు ద్వారా లాగినట్లయితే సముద్రపు నీరు భూమిలోనికి చొచ్చుకొని వస్తే, అంతమేర ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటి చోట్ల బోర్లు వేస్తే, ఉప్పునీరు తప్ప మంచినీరు రాదు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని బట్టి సముద్రపు జలాలు భూమిలోనికి చొచ్చుకొనిపోవడానికి అరికట్టే ప్రయత్నం చేయ్యాలి. ఇప్పటికే ఇటువంటి పరిస్ధితి చాలా చోట్ల ఏర్పడింది.జకార్తా, ఇండోనేషియా, వియత్నాంలోని మెకలు డెల్టా లోని వరిపొలాల ప్రాంతంలో కూడా చాలాచోట్ల ఇటువంటి పరిస్థితి ఉంది.
వాతావరణంలో వచ్చిన మార్పులవల్ల జనాభాకు తీవ్ర నష్టం కలగనున్నది. ఒక అధ్యయన సంస్థ చేసిన సర్వే ప్రకారం వాతావరణంలో వచ్చిన పెద్ద మార్పువల్ల ౧౩౩ మిలియన్ నుంచి ౩౭౫ మిలియన్ల ప్రజలకు ప్రమాదం కలగబోతుంది.

Share this post


Watch Dragon ball super