కుటీర పరిశ్రమలు

కుటీర పరిశ్రమలు

స్త్రీలు కుటుంబ వ్యవస్థకు కేంద్ర బిందువు వంటి వారు.

kuteera-parisramalu-4మన దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రు ఏమన్నారంటే “ ఏ దేశం యొక్క పరిస్థితినైనా అంచనా వెయ్యాలంటే ముందుగా ఆ దేశంలోని
మహిళల పరిస్థితులను అంచనా వేయ్యవలసిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు”. అందువలన మహిళలు సామాజిక , సాంఘీక, ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచడానికి వారిని స్వయం ఉపాధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతగానో ఉంది. మహిళలు తక్కువ పెట్టుబడితో స్థాపించి నిర్వహించగలిగే కుటీర పరిశ్రమలు చేపట్టే విధంగా వారికి తగిన ప్రోత్సాహం మరియు సహకారం అందించాలి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొనిభారత ప్రభుత్వం ఎన్నో పధకాలను రూపొందించి, అమలు చేస్తూ ఉంది.

అయితే ముందుగా కుటీర పరిశ్రమలు అంటే ఏమిటో తెలుసుకుందాం.
కుటీర పరిశ్రమలు: అనగా తక్కువ పెట్టుబడితో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఇంటిలోనీ ప్రతి స్త్రీ విజయ వంతంగా నిర్వహించగలిగే పరిశ్రమలు.
తక్కువ పెట్టుబడి అనగా సుమారు లక్ష రూపాయలు కంటే తక్కువ పెట్టుబడి తో ముగ్గురు లేదా నలుగురు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించుకోగలిగే చిన్న తరహా పరిశ్రమలు.
ఈ కుటీర పరిశ్రమలు ముఖ్యంగా మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. అవి

1. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు (Farm)
kuteera-parisramalu-1

ఉదా :
లాభదాయక మైన వాణిజ్య పంటల పెంపకం
ఉద్యానవన పంటల పెంపకం
పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ లేదా పౌల్ట్రీ , గొర్రెల, మేకల పెంపకం తదితరమైనవి.

2. వ్యవసాయేతర పరిశ్రమలు
(Non Farm)
kuteera-parisramalu-2

ఉదా :
అగరబత్తి తయారి, కొవ్వొత్తులతయారి, నాయిల్,డిటర్జెంట్.

3. వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు(Trade)
kuteera-parisramalu-3

ఉదా :
కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్లు, ఫ్యాన్సీ స్టోర్స్

ఇలా కుటీర పరిశ్రమలు 3 రకాలుగా విభజించుకోవచ్చు. మహిళలు తమ తమ నైపుణ్యాలు మరియు శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా సరైన కుటీర పరిశ్రమలను ఎంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కుటీర పరిశ్రమల వలన లాభాలు ఉన్నాయి. అవి

  • మహిళల ఆర్ధికాభివృద్ధి దిశగా అడుగు వేయ్యడానికి తోడ్పడుతుంది.
  • మహిళలు సాధికారతను సాధించవచ్చు.
  • కుటుంబ సాంఘీక ఆర్ధిక స్థితిని మేరుగుపరుచుకోవచ్చు.
  • పిల్లల సంపూర్ణ వికాసానికి కావలసిన ఆర్ధిక వనరుల సమీకరణకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.

అందువలన గాంధీజీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా ఇవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అని పేర్కొన్నారు. అంతే కాకుండా గాంధీజీ సేవాగ్రమ్ ను స్థాపించి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు.

రవీంద్రనాద్ఠాగూర్ శ్రీ నికేతన్ ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించి కుటీర పరిశ్రమలను గురుదేవులుగా ప్రోత్సహించడం జరిగింది.
కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే సంస్థలు ముఖ్యంగా మహిళల ఆసక్తి, అనుభవం, నైపుణ్యతలను దృష్టిలో పెట్టుకొని వారికి ఆయా రంగాలలో శిక్షణ మరియు సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఉదాహరణకు: రైతు మహిళలను వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలను చేపట్టే విధంగా ప్రోత్సహిస్తే వారికి ఆ రంగంలోవారికి ఉన్న అనుభవంకు శిక్షణ మరియు ఆర్ధిక సహకారం తోడై, వారు విజయ పధంలో పయనించడానికి ఎంతో అవకాశం ఉంటుంది.
అదే విధంగా వ్యవసాయ రంగంలో లేని మహిళలకు అగరబత్తి మరియు కొవ్వొత్తులతయారి వంటి వ్యవసాయేతర కుటీర పరిశ్రమలలో శిక్షణను ఇచ్చినట్లుయితే వారి ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచుకోడానికి అవకాశం ఇచ్చిన వారమవుతాము.

విద్యావంతులైన స్త్రీలు మరియు యువతులకు వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు చేపట్టే దిశగా ప్రోత్సహించవచ్చు.
గొర్రెల పెంపకం, పట్టు పరిశ్రమ, వర్మికంపోస్ట్ తయారి, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, పుట్ట గొడుగుల పెంపకం, పట్టు పురుగుల పెంపకం మహిళలు లాభదాయకంగా తక్కువ పెట్టుబడితో చేపట్ట దగిన వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలను ICAR సంస్థగా వారు పేర్కోనడం జరిగింది.

అందువలన రైతు మహిళలు ఈ పరిశ్రమలు చేపట్ట దలచినట్లయితే ప్రతి జిల్లాలో వ్యవసాయశాఖ వారి యొక్క రైతు శిక్షణా సంస్థ ( FTC ) లో శిక్షణను పొందవచ్చు. వ్యవసాయశాఖ వారు కాకుండా వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి ఉద్యాన వన శాఖ, పశు సంవర్ధకశాఖ, సెరికల్చర్ డిపార్టుమెంటు, అటవిశాఖ, మత్స్యశాఖ మొదలగు శాఖల శిక్షణా కేంద్రాలలో ఆయా శాఖలకు సంబంధించిన శిక్షణలను ఉచితంగా పొందడమే కాకుండా తగిన ఆర్ధిక సహాయాన్ని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందవచ్చు.

అదే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు అనుసంధానమైన కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల ద్వారా కూడా రైతు మహిళలు ఈ సాంకేతిక శిక్షణలను పొందవచ్చు.
రాష్ట్ర స్థాయిలోని SAMETHI, SMILDA వంటి శిక్షణా సంస్థలు రైతు మహిళల సాధికారతకు ఎన్నో శిక్షణలు ఇవ్వడమే కాకుండా వారికి తగిన Field visits (క్షేత్రసందర్శనలను) కూడా నిర్వహిస్తున్నాయి. అందువలన ప్రతి రైతు మహిళ ఈ శిక్షణా సంస్థలను గురించి తెలుసుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు చేపట్ట దగ్గ మహిళలు DRDA యొక్క TTDC(Training And Technology Development Centre) మరియు Ministry of HRD యొక్క జన శిక్షణా సంస్థాన్ (JSS), నెహ్రు యువ కేంద్రాలు, నుండిగాని, బ్యాంకులు నిర్వహిస్తున్న శిక్షణా సంస్థలు ఉదా: ABIRD(Andhra Bank Institute For Rural Development) నుండి గాని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న శిక్షణా సంస్థలు నుండి గాని తగిన శిక్షణలను పొందడమే కాక రుణ సౌకర్యంను కూడా పొందవచ్చు.

రాష్ట్ర స్థాయిలో KVIC,KVIB,APCOB, నుండి ఉత్తమైన శిక్షణలను
• ఖట్టల అద్దకము
• హస్తకళలు
• గృహాలంకరణ మరియు
• గృహోపకరణ వస్తువుల తయారిపై ప్రత్యేక శిక్షణలను అందుకోవచ్చు.

జాతీయ స్థాయిలో ఖాదీ మహా విద్యాలయ,RGP,NIRD వంటి సంస్థలు గ్రామీణ మహిళలకు ఎన్నో రకాలైన లాభదాయకమైన కుటీర పరిశ్రమలపై ఉచిత శిక్షణలను ఇవ్వడం జరుగుతుంది.

అందువలన గ్రామీణ మహిళలకు భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ శిక్షణలు, సహకారం మరియు పధకాలను గురించి అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అదే విధంగా వాణిజ్య రంగంలో కుటీర పరిశ్రమలైనటు వంటి కిరాణా షాపు యాజమాన్యం, జిరాక్స్ సెంటర్లు నిర్వహణ కొరకు ఎన్నో ప్రభుత్వ పధకాలు, బ్యాంకులు మరియు స్వచ్ఛంద సంస్థలు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది.
అదే విధంగా జిల్లా స్థాయిలో DIC,BMP ద్వారా మహిళలు కుట్లు, అల్లికలు, మెకానిక్, రిపేరింగ్, డ్రైవింగ్ వంటి వాటిలో మహిళలకు శిక్షణలు ఇస్తారు.

ఇక ప్రభుత్వ పధకాలు విషయానికి వస్తే గ్రామీణ అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కార్మిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న Skill development programme, Start up programme, Make in India ముఖ్యమైనవి. అందువలన స్త్రీలను కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న మంత్రిత్వ శాఖలు, సంస్థలు మరియు పధకాలను గురించి సమగ్రంగా తెలుసుకుని మహిళా సాధికారత దిశగా పయనించాలని ఆశిస్తున్నాం.

Share this post


Watch Dragon ball super