కొర్ర పోషణ వంటకాలు

కొర్ర పోషణ వంటకాలు

కొర్ర టొమాటో రైస్

కావలసిన పదార్థాలు :

కొర్రల అన్నం పది కప్పులు
నూనె, నెయ్యి 2 టి స్పూన్లు చొప్పున
లవంగాలు మూడు
దాల్చిన చెక్క మూడు ముక్కలు
సన్నగా తరిగిన టొమాటో ముక్కలు రెండున్నర కప్పులు
పచ్చి మిర్చి
ఉప్పు తగినంత
అల్లం వెల్లుల్లి అర  చెంచా
కారం చెంచా

తయారు చేసే విధానం :

బాణీలో నెయ్యి, నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. అది వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. నిమిషం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొంత ఉప్పుకారం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం  వెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మంట తగ్గిస్తే కాసేపటికి అవి  మగ్గుతాయి. అప్పుడు నీళ్ళు మిగిలిన ఉప్పు చేర్చి మంట తగ్గించాలి. అవి ఒక పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒక్కటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
korra-vantakaalu-1


కొర్ర పొంగలి

కావలసిన పదార్థాలు:

కొర్రలు పావు కప్పు
పెసరపప్పు పావుకప్పు
బియ్యం 2 టేబుల్ స్పూన్లు
నీరు అర  కప్పు
జీడిపప్పు కొన్ని
ఉప్పు తగినంత
జీలకర్ర పావు స్పూను
కరివేపాకు 1 రెబ్బ
అల్లం తురుము 1 టి స్పూను
పసుపు కొంచెం
నూనె లేదా    నెయ్యి 2 టి స్పూన్లు
పచ్చి మిరపకాయలు  2 – 3

తయారు చేసే విధానం:

బియ్యాన్ని, పెసరపప్పు ను  బాగా కడగాలి. కడిగిన తర్వాత 2 గంటలు సేపు నాన బెట్టాలి . వీటిని కుక్కర్ లో  ఉడకబెట్టాలి. బాణీ     తీసుకుని అందులో నూనె గాని నెయ్యి గాని వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, అల్లం, పసుపు వేసి తాలింపు చేసుకొని, ఉడకబెట్టుకున్న అన్నాన్ని కలపాలి.
korra-vantakaalu-2


కొర్రలతో పకోడీ

కావలసిన పదార్థాలు:

పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు కప్పు
జీలకర్ర పావు చెంచా
అల్లం పచ్చి మిర్చి పేస్ట్ పావు చెంచా
శనగపిండి, కోర్రపిండి అరకప్పు చొప్పున
ఉప్పు తగినంత
నూనె తగినంత

తయారు చేసే విధానం:

ఉల్లిపాయముక్కల్లో అల్లం పచ్చి మిర్చి పేస్ట్ వేసి కలపాలి తరువాత వీటిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్ని  వేసి  బాగా కలుపుకోవాలి. పకోడీ గట్టిగా కావాలి అనుకుంటే పావు నుంచి అరకప్పు నీళ్ళు చేరిస్తేచాలు. కాస్త మెత్తగా కావాలి అనుకుంటే కప్పు నీళ్ళు పొసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు బాణిలో నూనె వేడి చేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకొని ఎర్రగా వేగాక తీస్తే చాలు.
korra-vantakaalu-4


కొర్ర కొబ్బరి పాల అన్నం

కావలసిన పదార్థాలు:

వండిన కొర్రల అన్నం పది కప్పులు
నూనె, నెయ్యి పావు కప్పు చొప్పున
లవంగాలు 3
దాల్చిన చెక్క అంగుళం చొప్పున 3
ఉల్లిపాయలు ముప్పావు కప్పు
క్యారెట్ ముక్కలు అర కప్పు
పచ్చి బఠానీ కప్పు
పచ్చి మిర్చి 5
ఉప్పు తగినంత
కొబ్బరి పాలు రెండున్నర కప్పులు
అల్లం, వెల్లుల్లి  ముద్ద అర చెంచా

తయారు చేసే విధానం:

బాణిలో నెయ్యి, నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. నిమిషం తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు, పావుచెంచా ఉప్పు వేసి  వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి మంట తగ్గిస్తే కాసేపటికి అవి మగ్గుతాయి. అప్పుడు కొబ్బరి పాలు, మరి కొంచెం ఉప్పు వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి 2 నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
korra-vantakaalu-3


కొర్ర పాయసం

కావలసిన పదార్థాలు:

కొర్రలు అర కిలో
బెల్లం అర కిలో
నీరు 1 లీటర్
యాలుకలు తగినంత
గసాలు తగినంత
ఎండు కొబ్బరి తగినంత

తయారు చేసే విధానం:

శుభ్రం చేసిన కొర్రలను అరగంట సేపు నాన బెట్టి నీటిని ఒంపేయాలి. తర్వాత పొయ్యి మీద పాత్ర పెట్టి లీటరు నీటిని పోయాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెమ్మదిగా కొర్రలు వేస్తూ ఉండ కట్టకుండా కలుపుకోవాలి. మరో పాత్రలో నీరు తీసుకొని బెల్లాన్ని కరిగించాలి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం నీళ్ళను అందులో పోయాలి. అనంతరం ఎండు కొబ్బరి,  యాలుకలు, గసాలు వేసి కలిపి దించాలి.
korra-vantakaalu-5


Share this post


Watch Dragon ball super