ఆహార పదార్ధాలలో కల్తీని గుర్తించడం ఎలా

ఆహార పదార్ధాలలో కల్తీని గుర్తించడం ఎలా

ప్రస్తుత సమాజంలో స్వచ్ఛత, నాణ్యత అనే పదాలు అంతరించిపోతున్నాయి. మనం తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి అన్ని కల్తీ అయ్యాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వలన, వ్యాపార వర్గాల్లో స్వార్ధచింతన పెరిగిపోవడంతో ఆహార పదార్ధాలలో కల్తీ నానాటికి పెరిగిపోతున్నది. కల్తీ వలన వినియోగదారులు, ఆరోగ్యపరంగానూ, ఆర్ధికంగాను దోపిడీకి గురవుతున్నారు.

కల్తీ అంటే ఏమిటి?

ఆరోగ్యానికి హానికరమైన ఇతర పదార్ధాలను నిత్యావసర వస్తువుల్లో కలిపి అమ్మడమే కల్తీ. కల్తీ ఆహారం వలన రోగాల బారిన పడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.2 మిలియన్ల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) ప్రకటించింది.
ఆకారం, పరిమాణం, రంగుల్లో పెద్దగా తేడాలు లేకపోవడoతో ఏది అసలు పదార్దం / ఏది కల్తీ పదార్ధం గుర్తించడం చాలా కష్టం అయ్యింది. కల్తీ జరిగిన ఆహారం భుజించడం వలన దీర్ఘకాలంలో ప్రజలకు మధుమేహం, అధికరక్తపోటు, పక్షవాతం, గుండెజబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశము ఉంది.

kalteeni-gurtinchadam-ela-1

కాబట్టి వినియోగదారులు ఆహార పదార్ధాలలో కల్తీలను గురించి అవగాహన కలిగి ఉండాలి మరియు కల్తీలను గుర్తించగలగాలి.
ఇప్పుడు వివిధ ఆహారాలలో కలిపే కల్తీ పదార్ధాలు, వాటి వలన వచ్చే దుష్ఫలితాలు, వ్యాధులు మరియు ఆ కల్తీలను గుర్తించే పరీక్షలు తెలుసుకుందాం. కల్తీలను కొన్ని భౌతిక పరీక్షలు మరియు రసాయన పరీక్షలు ద్వారా గుర్తించవచ్చు.

వ. సం.ఆహారం కల్తీకి ఉపయోగించే పదార్ధాలుకలిగే వ్యాధులుకల్తీని కనుగొనే పధ్ధతి
1పాలుగంజిపొడి,
యూరియ, డిటర్జెంట్ పౌడర్
ఉదర సంబంధిత జబ్బులు 1)5 మి.లీ పాలను ఒక పరీక్ష నాళికలోకి తీసుకొని వేడి చెయ్యాలి. కొన్ని చుక్క ల అయోడిన్ ద్రావకాన్ని నమూనాకు కలపాలి. పాలలో గంజిపొడి ఉంటె బ్లూ రంగులోకి మారుతుంది.
2) 5 మి.లీ పాలను ఒక పరీక్ష నాళికలోకి తీసుకొని,2 చుక్కల బ్రోమోథైమోల్ బ్లూ ద్రావణాన్ని కలపాలి. బ్లూ రంగులోకి మారితే పాలలో యూరియా కలపినట్లు.
2పసుపుమెటానిల్ పసుపు రంగు, రంపపు పొట్టుపేగుల్లో పుండ్లు, క్యాన్సర్1)ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం పసుపు కలిపి చూడాలి. ఘదమైన పసుపు రంగు ఏర్పడితే నమూనాలో మెటానిల్ పసుపు కల్తీ చేసినట్లు. తేలికైన పసుపు రంగు ఏర్పడితే కల్తీ లేనట్లు.
2) రంపపు పొట్టు ఉన్నట్లయితే నీటిపైన తేలుతుంది. అసలు పసుపు అడుగు భాగంలో ఉంటుంది.
3కారం ఇటుక పొడి, రంపపు పొట్టు, నిషేదిత రంగులు జీర్ణ వ్యవస్థ దెబ్బతినటం, కాన్సర్, శ్వాస కోస వ్యాధులు.1)కొంచెం కారం తీసుకొని ఒక పరీక్ష నాళికలో కొంచెం పెట్రోలియం ఈథర్ వేయాలి. దానితో ఒక పదార్ధం తయారవుతుంది. దానిలో 13NH2SO4 ను కలపాలి. ఎర్ర రంగు కన్పిస్తుంది దానిలో కొంచెం డిస్టిల్ నీళ్ళు కలిపితే ఎర్ర రంగు అలాగే ఉంటే అది రంగుతో కల్తీ అయినట్లు. డిస్టిల్ నీళ్ళు కలపగానే రంగు పోతే స్వచ్ఛమైన కారంగా గుర్తించవచ్చు.
2)ఒక బీకేర్ లోకి కారం నమునాను తీసుకోవాలి. దానికి నీరు కలపాలి. కారం నీటిలో మునిగిపోతుంది. ఒకవేళ రంపపు పొట్టు కలిసి వుంటే నీటి పైకి తేలుతుంది. ఇటుకపొడి కలిసి వుంటే బీకేర్ అడుగు భాగమునకు చేరుతుంది.
4టీ పొడివాడిన టీ పొడి, రంపపు పొట్టు, ఇనుప రజను, రంగు ఉదర సంబంధిత వ్యాధులు1)తెల్లని కాగితం పై టీ ఆకులను నలిపితే కల్తీ రంగు బయట పడుతుంది. స్వచ్చమైన టీ ఆకులకు రంగు ఉండదు.
2) తెల్లని కాగితం పై టీ పొడి వేసి అయస్కాంతమును టీ పొడి దగ్గరగా అటు ఇటు తిప్పాలి. ఇనుప రజను ఉంటె అయస్కాంతమునకు అతుక్కుపోతుంది.
5నెయ్యి/
వెన్న
వనస్పతి, జంతువుల నుండి సేకరించిన కొవ్వు చూపు మందగించడం, గుండె జబ్బులు ఒక టీ స్పూన్ కరిగిన నెయ్యిని పరీక్ష నాళికలోకి తీసుకోవాలి. దానికి సమానంగా హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ను కలపాలి, దానికి కొంచెం చిటికెడు పంచదార కలపాలి. దానిని బాగా కలిపి పక్కన పెట్టి 5 నిముషాల తరువాత చూస్తే ద్రావకం క్రింది పొరలో గులాబీ రంగు లేక ఎరుపు రంగు ఏర్పడితే అది వనస్పతి మరియు ఇతర కొవ్వులతో కల్తీ అయినట్లు.
6పంచదార బట్టల సోడా, చాక్ పౌడర్ఉదర సంబంధిత వ్యాధులు1)ఒక స్పూన్ పంచదారను పరీక్ష నాళికలోకి తీసుకోవాలి. కొంచెం నీరు కలిపి కరిగించాలి. దానికి కొన్ని చుక్కలు హెచ్.సి.ఎల్ ఆమ్లాన్ని కలిపి చర్యను గమనించాలి. కల్తీ జరిగితే పొగలు వస్తాయి.
2) నీటిలో పంచదార వేస్తె చాక్ పౌడర్ ఉంటె నీటి అడుగుకు చేరుతుంది.
7వంట నూనెబ్రహ్మజెముడు నూనె గుండె జబ్బులుపరీక్ష నాళికలోకి నూనె కొంచెం తీసుకొని దానికి సమానంగా నైట్రిక్ ఆమ్లాన్ని తీసుకొని జాగ్రత్తగా కలపాలి. ఎరువు/ మట్టి రంగు వస్తే కల్తీ అయినట్లు బ్రహ్మజెముడు నూనె కలిసినట్లు.
8కందిపప్పుకేసరిపప్పు పక్షవాతం1)కొంచెం పప్పును పరీక్ష నాళికలోకి తీసుకోని 50 మి.లీ సజల హెచ్.సి.ఎల్ ఆమ్లాన్ని కలపాలి. 15 నిమిషాల తరువాత గమనిస్తే గులాబీ రంగు కన్పిస్తే అందులో కేసరి పప్పు కలిసినట్లు.
2) భూతద్దం సాయంతో కూడా గుర్తించవచ్చు. కేసరి పప్పు ఆకారము పలుకలుగా ఉంటుంది.
9మిరియాలుబొప్పాయి విత్తనాలుకాలేయ సంబంధ వ్యాధులు నీటిలో మిరియాలు వేసి చూడాలి, బొప్పాయి విత్తనాలు నీటిలో తేలుతాయి, మిరియాలు నీళ్ళలో మునుగుతాయి.
10ఆవాలు బ్రహ్మజెముడు గింజలుగుడ్డితనంనీటిలో ఆవాలు వేస్తే, బ్రహ్మజెముడు గింజలు ఉంటె నీటిపై తేలుతాయి. ఆవాలు నీటిలో మునుగుతాయి.
11కొబ్బరి నూనె మినరల్ ఆయిల్ జుట్టు ఊడిపోతుంది కొబ్బరి నూనెను చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. అరగంట తరువాత చూస్తే కొబ్బరి నూనె అయితే గడ్డ కడుతుంది. కల్తీ జరిగితే గడ్డ కట్టదు.
12ఇంగువ పొడిచాక్ పొడిఉదర సంబంధిత వ్యాధులుగాఢ హెచ్.సి.ఎల్ ఆమ్లం కొంచెం, తీసుకున్న ఇంగువ పైన వేసి చూడాలి. కల్తీ జరిగితే పొగలు వస్తాయి. ఇంగువ పొడి మంచిదైతే పొగలు రావు.
13గోధుమ పిండిగంజిపొడి, పొట్టు ఉదర సంబంధిత వ్యాధులు, కాలేయం పాడవటం 1)నీటిలో పిండి వేస్తే పొట్టు ఉంటే పైకి తేలుతుంది.
2)ఒక స్పూన్ గోధుమ పిండిని పరీక్ష నాళికలోకి తీసుకొని అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. గంజిపొడి ఉంటే బ్లూ రంగుకు మారుతుంది. కల్తీ లేకపోతే రంగు మారదు.
14తేనెబెల్లం పాకం, చక్కర ద్రావణం ఆర్ధిక నష్టం దూదిని తేనెలో ముంచి అగ్గిపుల్లతో వెలిగిస్తే అందులో ద్రావణం ఉంటే సరిగా అంటుకోదు లేదా చిటపటమని శబ్దం వస్తుంది. నాణ్యమైన తేనెలో ముంచిన దూది ఉండ బాగా మండుతుంది.
15బెల్లంచాక్ పౌడర్ ఉదర సంబంధిత వ్యాధులు10 గ్రాముల బెల్లంను ఒక గ్లాసు నీటిలో వేయాలి. కాసేపు కదపకుండా ఉంచితే, చాక్ పౌడర్ ఉంటే అడుగు భాగంలోకి చేరుతుంది.
16పచ్చి బఠానీనిషేధిత రంగునీటిలో కొన్ని బఠానీలను వేసి బాగా కలిపి ఒక అరగంట ఉంచితే, రంగు వేరుగా కన్పిస్తుంది. నీటిలో అలా రంగు కనిపిస్తే రంగు వేసినట్లు.

పైన చెప్పిన రసాయన పరీక్షల ద్వారా ఆహారంలో జరుగు కల్తీని గుర్తించడానికి వీలుగా  ఆచార్య.ఎన్.జి.రంగ.వ్యవసాయ విశ్వవిద్యాలయం, హోమ్ సైన్స్ కళాశాల, గుంటూరు వారు “ఆహారంలో కల్తీని కనుగొనే కిట్ “ను రూపొందించారు. ఈ కిట్ లో కావాల్సిన రసాయనాలు అన్నీ ఉంటాయి.

kalteeni-gurtinchadam-ela-7

గతంలో అనేక ఆహార భద్రతా చట్టాలు అనగా ఒక్కొక్క ఆహార ఉత్పత్తికి  ఒక్కొక్క చట్టం ఉండేది. ఉదాహరణ: ఫ్రూట్ ప్రోడక్ట్ ఆర్డర్, మిల్క్ ప్రోడక్ట్ ఆర్డర్, మీట్ ప్రోడక్ట్ ఆర్డర్ అలా అన్ని చట్టాలను కలిపి వాటి స్థానంలో ఇప్పుడు ఒకే చట్టం  “ఫుడ్ సేఫ్టి మరియు స్టాండర్డ్  చట్టం”, 2006 లో వచ్చింది. ఈ చట్టం క్రింద ఫుడ్ సేఫ్టి మరియు స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా [FSSAI] అనే సంస్థ శాసనసభచే అమోదించబడిన, చట్టబద్దమైన సంస్థ నెలకొల్పబడింది. ఆహార ఉత్పత్తులకు ఎఫ్.ఏస్.ఎస్.ఎ.ఐ ముద్ర ఉండేలా చూసుకోవాలి. కల్తీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చును.

ఏది ఏమైనా వినియోగదారులందరూ ఆహార పదార్దాల్లో జరుగు కల్తీలపై కనీస అవగాహన కలిగి ఉండటం అవసరం.

టి.నీరజ, డీన్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ హోం సైన్స్,
బి.విజయ కుమారి,
టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

Share this post


Watch Dragon ball super