జొన్న- పోషణ వంటకాలు

జొన్న- పోషణ వంటకాలు

జొన్న బజ్జి

కావలసిన పదార్ధాలు:

జొన్న పిండి అర కిలో
శనగ పిండి పావు కిలో
తరిగిన పాలకూర 2 కట్టలు
నూనె 1  లీటర్
ఉప్పు తగినంత
వాము 1 టి స్పూను
ఉల్లిపాయలు అర కిలో
వంట సోడా సరిపడ

తయారుచేసేవిధానం:

ఒక గిన్నెలో శనగ పిండి, జొన్న పిండి, ఉప్పు, వాము, వంటసోడా  వేసి,  తగినంత నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోవాలి. తరువాత మిరపకాయలను పిండిలో ముంచి నూనె కాగిన తరువాత బజ్జీలు వేసుకోవాలి.
image003

జొన్న కట్టే పొంగలి

కావలసిన పదార్ధాలు:

జొన్న రవ్వ 100 గ్రా
పెసరపప్పు 50 గ్రా
మిరియాలు 10 గ్రా
ఎండు మిర్చి 4
కరివేపాకు 2 రెబ్బలు
ఉప్పు తగినంత
నెయ్యి 10 గ్రా
జీడిపప్పు 10 గ్రా

తయారు చేసే విధానం:

కుక్కర్ లో నెయ్యి వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ను వేయించి ఆ తరువాత జొన్న రవ్వ, పెసరపప్పు, మిరియాలు తగినంత ఉప్పు వేసుకొని తగినంత నీళ్ళు పోసి ఆ తరువాత మూడు విజిల్స్ వచ్చె వరకు ఉంచాలి.
image001

జొన్న పాలక్ పకోడీ

కావలసిన పదార్ధాలు:

జొన్న పిండి పావు కిలో
శనగ పిండి అర కిలో
బజ్జి మిరపకాయలు 1 కిలో
ఉప్పు తగినంత
వాము 2 టేబుల్ స్పూన్లు
వంట సోడా తగినంత
నూనె అర లీటర్

తయారు చేసే విధానం:

ఒక గిన్నెలో జొన్న పిండి, శనగ పిండి, తరిగిన పాలకూర, ఉప్పు, వాము, ఉల్లిపాయలు, వంట సోడా, నీళ్ళు పోసుకొని పిండిని పకోడీ వేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలి. ఈ పిండిని కాగిన నూనెలో పకోడిలా వేసుకొని వేయించాలి.
image005

జొన్న బిసిబెళ్ బాత్

 కావలసిన పదార్ధాలు

జొన్న రవ్వ 2 కప్పులు
కందిపప్పు 1 కప్పు
  తరిగిన కూరగాయ  ముక్కలు
(క్యారెట్, బిన్స్, ఉల్లిపాయలు,)
2 కప్పులు
పోపుగింజలు, కరివేపాకు దాల్చిన చెక్క   పోపుకు సరిపడ,2రెబ్బలు,  2ముక్కలు
లవంగాలు 3
మెంతులు పావు స్పూను
చింతపండు పేస్ట్ 1 స్పూను
బిసిబెళ్ బాత్ పొడి 2 స్పూన్లు
ఉప్పు తగినంత
నూనె తగినంత

తయారు చేసే విధానం:

రవ్వను కందిపప్పును 6 కప్పుల నీటిలో కలిపి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. నూనె ను వేడి చేసి పోపు పెట్టి ఇంగువ  వేయాలి. తరిగిన ఉల్లిపాయలు, కూరగాయలు వేసి వేయించాలి. దీనికి చింతపండు పేస్ట్, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి సరిపడా నీటిని పోయాలి.కొద్ది సేపు ఉడికించి, బిసిబెళ్ బాత్ పొడిని కలపాలి. దీనికి ఉడికించిన రవ్వ మరియు పప్పు మిశ్రమాన్ని కలిపి బాగా కలియతిప్పాలి.. కొద్ది సేపు ఉడికించి, తయారయ్యాక కొద్దిగా నెయ్యి కలిపి దించుకోవాలి.
image007

Share this post


Watch Dragon ball super