ఇంట్లో లైటింగ్ ఎలా ఉండాలి

ఇంట్లో లైటింగ్ ఎలా ఉండాలి

ఇంటికి, ఆఫీసుకు కాంతి చాల ముఖ్యం. కాంతి లేని చోట శక్తి ఉండదు. అయితే ఆ కాంతి పరిమితంగా ఉండాలి. ఎక్కువగా ఉన్న సమస్యలు వస్తాయి. ఫెంగ్ షూ సూత్రాల ప్రకారం కాంతి ఎలాగ ఉండాలో చూద్దాం…
intlo-lighting-elavundali-1

  • కాంతి శాంతి ఇచ్చేలా ఉండాలి. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉండకూడదు. ఎక్కువ కాంతి ఉంటే – ఎక్కువ శక్తి ప్రసారమై అనేక సమస్యలోస్తాయి.
  • వీలైనంత వరకు రెండు లైట్లను ఉపయోగించాలి. ఫెంగ్ షూ సిద్ధాంతాల ప్రకారం కాంతి సమతుల్యం చాల ముఖ్యం. అందుకే ఆధునిక లైటింగ్ లో ఎక్కువగా రెండు లైట్లు కనిపిస్తాయి.
  • కాంతి వేర్వేరు ప్రాంతాల నుంచి రావాలి. వేర్వేరు తీవ్రతలతో ఉండాలి. ఒక చోట పెద్ద లైటు పెట్టి – దాని ద్వారా గదిలో కాంతిని
    నింపాలనుకోవటం సరికాదు. ఇటీవల కాలంలో సీలింగ్ లలో లైట్లను పెడుతున్నారు. దీని వల్ల కాంతి గదంతా పడుతుంది. దీనితో పాటు గది మూలల్లో కూడా లైట్లను పెట్టుకోవాలి.
  • సహజ సిద్ధంగా సూర్యుడు ప్రసారం చేసే కాంతి చాల ముఖ్యమైనది. దీనిలో కృత్రిమ కాంతి కన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. అందువల్ల ప్రతి గదిలోను వీలైనంత ఎక్కువ సూర్యకాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
  • ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫ్లోరోసెంట్ లైట్లను వాడుతున్నారు. ఫెంగ్ షూ సూత్రాల ప్రకారం ఫ్లోరోసెంట్ కాంతిని వీలైనంత వరకూ తగ్గించాలి. ఒక వేళ తప్పనిసరి అయితే ఫ్లోరోసెంట్ లైట్లను అద్దం ముందు వచ్చేటట్లుగా చూడాలి. అప్పుడు కాంతి అద్దం
    మీదుగా పరావర్తనం చెందుతుంది.
  • నూనె దీపాలను, కొవ్వొత్తులను ఉపయోగించటం వల్ల పాజిటివ్ శక్తిని ప్రసారం చేయ్యవచ్చు. వీలైనన్ని చోట్ల నూనె దీపాలను, కొవ్వొత్తులను వాడాలి.

Share this post


Watch Dragon ball super