ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ)

ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ)

ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా 2006, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం కింద నెలకొల్పబడింది. దీనిలో ఉన్న వివిధ చట్టాలు, ఆదేశాలు వివిధ శాఖలు విభాగాల్లోని ఆహార సంబంధ అంశాలను క్రమబద్ధo చేస్తాయి. ప్రజలు వినియోగించటానికి వీలుగా సురక్షితమైన, సంపూర్ణ ఆహారం వారికి అందించేలా చేయడానికి ఆహార వస్తువులకు శాస్త్రీయపరమైన ప్రమాదాలను ఏర్పాటు చేసి, వాటి తయారీ, భద్రపర్చటం పంపిణీ, విక్రయాలను క్రమ బద్ధం చేయటానికి శాసన సభచే ఆమోదించబడిన చట్టబద్ధమైన సంస్థ ఇది.

అధారిటీ బాధ్యతలు, విధులు:
ఈ క్రింది విధులను నిర్వహిoచటానికి 2006, ఎఫ్ఎస్ఎస్ చట్టం ఎఫ్ఎస్ఎస్ఎఐ ను ఆదేశించింది.

 • ఆహార వస్తువులకు సంబంధిoచి ప్రమాణాలు, మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయడానికి నిబoధనలు రూపొందించటం, నోటిఫై చేసిన వివిధ ప్రమాణాలను అమలు చేయటానికి సక్రమమైన వ్యవస్థను నిర్దేశించటo.
 • ఆహార వ్యాపారాల కోసం ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ వ్యవస్థ ధృవీకరణలో నిమగ్నమైన ధృవీకరణ సంస్థల గుర్తింపు కొరకు యంత్రాంగాలు, మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయటo.
 • ప్రయోగశాలల గుర్తింపు పొందిన నోటిఫికేషన్ కోసం ప్రక్రియలు, మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయటం.
 • ఆహార భద్రత పౌష్టికతకు సంభందించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనే రంగాల్లో పాలసి, నియమాలు రూపొందించే అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రీయపరమైన సలహా, టెక్నికల్ మద్ధతు కేటాయించడం.
 • ఆహార వినియోగం, జీవ సంభంధమైన ప్రమాదం సంభవించటం, ప్రబలంగా ఉండటం, ఆహారంలో కలుషితాలు, ఆహార ఉత్పత్తుల్లో వివిధ రకాలైన కలుషితాలు అవశేషాలు, తలెత్తే ప్రమాదాలను గుర్తించడం, అప్రమత్తంగా ఉండే వ్యవస్థను పరిచయం చేయటానికి సబంధిoచిన డేటా సేకరించడం.
 • దేశంలో ఒక సమాచార నెట్వర్క్ను ఏర్పాటు చేయటం. దీనివల్ల ప్రజలు, వినియోగదారులు, పంచాయితీలు తదితరులు ఆహార భద్రత, ప్రమాదకరమైన అంశాలకు చెందిన నమ్మదగిన, లక్ష్యపరమైన సమాచారాన్ని అందుకోగలరు.
 • ఆహార వ్యాపారాల్లో నిమగ్నమైన లేదా నిమగ్నం కావాలని కోరుకున్న వ్యక్తులకు శిక్షణా కార్యక్రమాలు కేటాయించటం.
 • ఆహరం, పారిశుధ్యం, ఫైటో – శానిటరిల ప్రమాణాలకు అంతర్జాతీయ టెక్నికల్ ప్రమాణాల అభివృద్ధికి సహాయం చేయటం.
 • ఆహార భద్రత, ఆహార ప్రమాణాలకు సంబంధించిన సాధారణ చైతన్యాన్ని ప్రచారం చేయటం తదితరాల వంటివి.

ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు:
1. ఈ క్రిందివి ఏర్పాటు చేయబడ్డాయి

 • ది ఫుడ్ అథారిటీ
 • సెంట్రల్ అడ్వైసరీ కమిటీ
 • సైంటిఫిక్ కమిటీ
 • ఈ క్రింది వాటిపై సైంటిఫిక్ పేనల్స్- పౌష్టికాహారం, నుట్రాసేతటికల్స్, ఆహార నియంత్రణ ఉత్పత్తులు, అటువంటివే ఇతర ఉత్పత్తులు.
 • శ్యాంప్లింగ్ పద్ధతి, విశ్లేషణ
 • ఆహార సంయోజనాలు, ఫ్లేవరింగ్స్, ప్రాసెస్సింగ్ సహాయకాలు, ఆహారానికి సంబంధించిన సామాగ్రి
 • ఫుడ్ చైన్ లో కల్తీలు
 • జీవ ప్రమాదాలు
 • కీటకనాశనులు, యాoటిబయోటిక్స్ అవశేషాలు
 • లేబలింగ్ మరియు క్లైoలు ప్రకటనలు
 • జన్యుపరoగా మార్పు చేయబడిన జీవులు మరియు ఆహారాలు

2. కింద పేర్కొన్న అధ్యయనాలు మరియు సర్వేలు ఆరంభించబడ్డాయి

 • ప్రోసెస్డ్ , నాన్- ప్రోసెస్డ్ ఆహారం వినియోగం విధానం
 • ఆహార నిబంధనల తయారీ

3. పిఎఫ్ఏ నుండి ఎఫ్ఎస్ఎస్ఎ కి మారటం పై సూచనలను ఆహ్వానిస్తూ బారతదేశ మంతటా వర్క్ షాపులు నిర్వహించబడ్డాయి.
4. విస్తృతమైన సంప్రదింపుల తరువాత అధారిటి కొత్త వ్యవస్థ రూపొందించబడింది.
5. ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. ఈ పోర్టల్ ద్వారా వెబ్ పై పబ్లిక్ నోటిసులు, ప్రజల్ని సంప్రదించటానికి వివిధ ముసాయిదాలు పోస్ట్ చేయబడతాయి.
6. కొత్త కార్యాలయాలను కిరాయికి తీసుకోవటం ద్వారా ప్రస్తుతమున్న కార్యాలయాల నవీకరణ, కంపూటర్లు, ఇంటర్నెట్ కేటాయించటం, ఆఫీస్ ఆటోమేషన్ కు వివిధ సాఫ్ట్వేర్ ప్యాకేజేలైన కామ్-డిడిఓ ప్యాకేజ్, ఫైల్ ట్రాకింగ్ వ్యవస్థ, ఈ కార్యాలయం తదితరాలు నెలకొల్పటం.
7. ఇప్పటి వరకు అధారిటి మూడు సమావేశాలు జరిగాయి. వీటిలో నియమ, నిభందనలు ఆమోదిoచబడ్డాయి.
8. వివిధ ముసాయిదా నిబంధనలు తయారు చేయబడి ప్రజలు, ఇతర స్టేక్ హోల్డర్ల వ్యాఖ్యానాల కోసం బహిర్గతం చేయబడ్డాయి.
9. కోడెక్స్ సమావేశంలో పాల్గొనటానికి మార్గదర్శక సూత్రాలు, కోడెక్స్ అంశాల్లో ప్రతిస్పందన తయారీ, కోడెక్స్ సంప్రదింపు పాయింట్ మార్గదర్శక సూత్రాలు, నేషనల్ కోడెక్ కమిటీ, నేషనల్ షేడో కమిటీలను ఫుడ్ అధారిటి ఆమోదించి. ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ నేషనల్ కోడెక్స్ కాంటాక్ట్ పాయింట్ గా పనిచేస్తోంది.
10. పాల ఉత్పత్తుల్లో మెలమైన్ కల్తీ, వెరుశనగా నూనెలో సాల్మొనెల్లా కల్తీల ప్రమాదాలను గురించి సలహాలు జారీ చేయబడ్డాయి.
11. ట్రాన్స్ ప్యాటి యాసిడ్స్, ఆరోగ్య క్లైoలు తదితరాల వంటి ప్రత్యేక అంశాలను పరిరక్షించటానికి ఎన్నో నిపుణుల గ్రూపులు రూపొందించబడ్డాయి.
12. సురక్షితమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందచేయటానికి మొదటిసారిగా సేఫ్ ఫుడ్, టేస్టిఫుడ్ పైలట్ ప్రాజెక్ట్ గా డిల్లీల్లో గత సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అందించడం జరిగింది.
13. ఎఫ్ ఎస్ ఎస్ ఎకి మారటం పై ప్రతిస్పందనను పొందటానికి రాష్ట్ర ఫుడ్ కమిషనర్స్, ఇతర స్టేక్ హోల్డర్స్ తో సమావేశం నిర్వహించబడింది.

టి.నీరజ ,డీన్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ హోం సైన్స్,
వి.ప్రసూన ,టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

Share this post


Watch Dragon ball super