చిరుధాన్యాలు – పోషకాహార గనులు

చిరుధాన్యాలు – పోషకాహార గనులు

chirudhanyalu-poshakaharaganulu-2

చిరుధాన్యాలలో శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వగలిగే పోషకపదార్ధాలు ఎక్కువ పరిమాణoలో ఉంటాయి. వరి, గోధుమ, మొక్కజోన్నలను ధాన్యాలగాను, జొన్న, కొర్ర, సజ్జ, రాగి, సామ, వరిగ మొదలైన వాటిని చిరుధాన్యాలగాను వ్యవహరిస్తారు. మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ మొదలైన జీవనశైలి రుగ్మతలను అదుపులో ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. పోషకవిలువ పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి. కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన హరితవిప్లవం వలన వరి, గోధుమ దిగబడి పెరగడం, వాడుకకు అనువుగా అందుబాటులోకి రావడం వలన చిరుధాన్యాల వాడకం తగ్గిపోయింది. అంతేకాకుండా చిరుధాన్యాలపొట్టు తీయడం వంటకు సిద్ధం చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని కావడం మరోక కారణం.

ఈ చిరుధాన్యాలలో పీచు త్వరగా జీర్ణంకాని పిండిపదార్ధాలు ఉంటాయి. పీచు నుండి గ్లూకోజు నెమ్మదిగా విడుదులవుతుంది. అదే విధంగా పిండిపదార్ధాలు కూడా ఆలస్యంగా జీర్ణం అవ్వటం వలన త్వరగా ఆకలి కాదు. ఇది మధుమేహులకు చాల మంచిది. ఈ చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునే వారు బరువు పెరగరు. క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి అందుకని రోజులో ఏదో ఒక భోజనంలో చిరుధాన్యాలను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇతర ధాన్యాల లాగా కాకుండా, చిరుధాన్యాలను పోట్టుతీయకుండానే వాడవచ్చు, అందువల్ల పొట్టులో ఉండే బి విటమిన్లు థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ ను నష్టపోకుండా ఉంటాయి.

వీటిలో ఖనిజలవణాలు అయిన కాల్షియo,ఇనుము కూడ అధికంగా ఉంటాయి.ముఖ్యంగా సజ్జలలో ఫోలిక్ యాసిడ్ రాగులలో ఇనుము,కాల్షియo అధికంగా ఉండటం వల్ల గర్భిణి స్త్రీలకు మంచిది.

చిరుధాన్యాలు-పోషకవిలువలు:

సజ్జలు: ఇవి శరీరపెరుగుదలకు బాగా తోడ్పడతాయి మరియు అధిక శక్తి ని అందిస్తాయి.
మలబద్ధకాన్ని అరికడతాయి. ఈ సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల అల్సర్ ను తగ్గించవచ్చు.
సజ్జలలో శక్తి, మాంసకృత్తులు ఇనుము, పీచు అధికంగా ఉంటుంది.

chirudhanyalu-poshakaharaganulu-3

కేలరీలు (కిలో కేలరీలు )378
ఖనిజాలు(గ్రా)2.3
ఇనుము (మిగ్రా)16.9
కాల్షియo(మిగ్రా)38
ప్రోటీన్(గ్రా)10.6
ఫైబర్(గ్రా)1.3
ఫ్యాట్(గ్రా)4.8

రాగులు: రాగులు తినడం ద్వారా మధుమేహం వ్యాధిని నియంత్రించవచ్చు. రాగులలో అధికoగా ఖనిజాలు మరియు కాల్షియo అధికంగా ఉంటుంది. శరీరoలోని వేడి ని తగ్గిస్తుంది. రక్తహీనతను, అల్సర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది రాగులలో శక్తి, మాంసకృత్తులు, సున్నం, పీచు అధికంగా ఉంటుంది.
chirudhanyalu-poshakaharaganulu (5)

కేలరీలు (కిలో కేలరీలు )376
ఖనిజాలు(గ్రా)2.7
ఇనుము (మిగ్రా)3.9
కాల్షియo(మిగ్రా)344
ప్రోటీన్(గ్రా)7.3
ఫైబర్(గ్రా)3.6
ఫ్యాట్(గ్రా)1.5

కొర్రలు: కొర్రలు తినడం వలన రక్తంలోని చెక్కర స్థాయిని తగ్గించవచ్చు. వీటిలో పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. శరీర పెరుగుదలకు తోడ్పడుతుంది. కొర్రల్లో శక్తి, మాంసకృత్తులు, ఇనుము, పీచు అధికంగా ఉంటుంది.
chirudhanyalu-poshakaharaganulu-1

కేలరీలు (కిలో కేలరీలు )473
ఖనిజాలు(గ్రా)3.3
ఇనుము (మిగ్రా)2.8
కాల్షియo(మిగ్రా)31
ప్రోటీన్(గ్రా)12.3
ఫైబర్(గ్రా)8
ఫ్యాట్(గ్రా)4

సామలు: ఇవి తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులు దరికి చేరవు.అలాగే రుతుక్రమం సరిగ్గా రావడానికి ఉపయోగపడతాయి. మలబద్ధకాన్ని అరికడుతుంది. సీలియాక్ జబ్బుకు అనువైన ఆహారం. సామలలో శక్తి, క్రొవ్వు, ఇనుము, పీచు అధికంగా ఉంటుంది.
chirudhanyalu-poshakaharaganulu (3)

కేలరీలు (కిలో కేలరీలు )207
ఖనిజాలు(గ్రా)1.5
ఇనుము (మిగ్రా)9.3
కాల్షియo(మిగ్రా)17
ప్రోటీన్(గ్రా)7.7
ఫైబర్(గ్రా)7.6
ఫ్యాట్(గ్రా)5.2

వరిగలు:కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని అరికట్టడం లో తోడ్పడుతుంది .సీలియాక్ జబ్బుకు అనువైన ఆహారం. ఈ వరిగలలో శక్తి, పీచు అధికంగా ఉంటాయి.
chirudhanyalu-poshakaharaganulu-1

కేలరీలు (కిలో కేలరీలు )356
ఖనిజాలు(గ్రా)1.9
ఇనుము (మిగ్రా)0.8
కాల్షియo(మిగ్రా)14
ప్రోటీన్(గ్రా)12.5
ఫైబర్(గ్రా)2.2
ఫ్యాట్(గ్రా)2.9

ఆరికలు:ఈ ఆరికలు తినడం వల్ల మధుమేహం మరియు ఊబకాయం అదుపులో ఉంటాయి. కొర్రల కన్న ఆరికల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరికల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి.
chirudhanyalu-poshakaharaganulu (4)

కేలరీలు (కిలో కేలరీలు )309
ఖనిజాలు(గ్రా)2.6
ఇనుము (మిగ్రా)0.5
కాల్షియo(మిగ్రా)27
ప్రోటీన్(గ్రా)8.3
ఫైబర్(గ్రా)9
ఫ్యాట్(గ్రా)3.6

ఊదలు: ఈ ఊదలు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చెక్కర స్థాయి అదుపులో ఉంచుతుంది. ఇందులో పిండిపదార్ధాలు మరియు శక్తి స్థాయి తక్కువలో ఉంటుంది అందువల్ల బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. శరీర ఉష్ణోగ్రత ను అదుపులో ఉంచుతుంది. ఈ ఊదలు లో పీచు అధికంగా ఉంటుంది.
chirudhanyalu-poshakaharaganulu (7)

కేలరీలు (కిలో కేలరీలు )342
ఖనిజాలు(గ్రా)4.4
ఇనుము (మిగ్రా)15.2
కాల్షియo(మిగ్రా)11
ప్రోటీన్(గ్రా)11.2
ఫైబర్(గ్రా)10.1
ఫ్యాట్(గ్రా)3.9

జొన్నలు: ఈ జొన్నలు తీసుకోవడంవల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు అలాగే జొన్నలు రోజు మన ఆహారం లో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు. ఇది సీలియాక్ జబ్బు కి మంచి ఆహారం. మధుమేహులలో చెక్కర ను నివారిస్తుంది. ఇవి తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి అవి నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్ మరియు ఇనుము, కాల్షియo అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి తీసుకోవడం ద్వారా రోజులో సగానికి సరిపడా ప్రోటీన్ లు లభిస్తాయి.
chirudhanyalu-poshakaharaganulu (6)

కేలరీలు (కిలో కేలరీలు )329
ఖనిజాలు(గ్రా)1.6
ఇనుము (మిగ్రా)5.4
కాల్షియo(మిగ్రా)25
ప్రోటీన్(గ్రా)10.4
ఫైబర్(గ్రా)2
ఫ్యాట్(గ్రా)3.1

Share this post


Watch Dragon ball super