“మెరిసేదంతా బంగారం కాదు” – బంగారు ఆభరాణాల కొనుగోలులో జర జాగ్రత్త

“మెరిసేదంతా బంగారం కాదు” – బంగారు ఆభరాణాల కొనుగోలులో జర జాగ్రత్త

మన దేశంలో బంగారంపై ఉన్నటువంటి మక్కువ ప్రపంచంలో మరేదేశంలోను లేదనవచ్చు. గత సంవత్సరం జరిగిన బంగారం, బంగారు ఆభరణాల వ్యాపారం 967 టన్నులు జరిగిందంటే అర్ధమవుతుంది. మనకెంత మక్కువో బంగారంపై. వినియోగదారులు అతి తక్కువ ఖరీదుతో కొనేటువంటి కాయగూరల విషయంలో తీసుకొనేటువంటి జాగ్రత్తలు కూడా బంగారు ఆభరణాల కొనుగోలులో తీసుకోక పోవడం, కొనుగోలు సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వాటిపై అవగాహన లేకపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు ప్రతిరోజు కోట్లాది రూపాయలను నష్టపోతున్నారు.

bangaaru-abharanala-konugolulo-jagrathalu-1

మోసం జరిగేతీరు:

ప్రస్తుతం చాలా దుకాణాలలో 916 కెడిఎం బంగారు ఆభరణాలు అమ్ముతున్నామని చెబుతూ 24 క్యారెట్ల బంగారం రేటు వసూలు చేస్తున్నారు. అసలు 916 కెడిఎం అంటే ఏమిటి? 916 కెడిఎం అంటే 22 క్యారెట్ల బంగారంలో తయారు చేసిన ఆభరణాలను 24 క్యారెట్ల రేటుతో అమ్మడం చేత వినియోగదారుడు 1 తులం (10 గ్రాములు )బంగారు ఆభరణాల కొనుగోలులో సుమారు రూ.2625లు మోసపోతున్నారు.

ఇక రెండవది ప్రధానమైన మోసం తరుగు (వేస్ట్) ఏ బంగారు ఆభరణాలు అమ్మే దుకాణంలోనైనా ఆభరణాలు కొనుగోలు చేస్తే 10 నుంచి 14 శాతం తరుగు వసూలు చేస్తున్నారు. 10 గ్రాముల బరువు కలిగిన బంగారు ఆభరణం కొనుగోలు చేస్తే కనీసం రూ.3150 నుంచి రూ.4000ల వరకు తరుగు రూపంలో వినియోగదారుడు మోసపోతున్నాడు. తరుగు అనేది వినియోగదారుడికి సంబంధించిన విషయం కాదు.

నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే, వినియోగదారుడు ఎంత బరువు ఆభరణం పొందుతున్నాడో దానికి సరిపడా డబ్బులు మాత్రమే చెల్లించాలి. కానీ అమ్మకందారులు నిబంధనలను అతిక్రమించి వినియోగదారులను మోసం చేస్తున్నారు.

మరొక మోసం ఏమిటంటే కొన్ని బంగారు నగల దుకాణంలో ఆభరణాలకు పొదిగిన రాళ్ళతో పాటు బరువును లెక్కించి మొత్తం బరువుకు, బంగారు రేటుతో వసూలు చేస్తూ అదనంగా రాళ్ళ బరువుకు కూడా వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆభరణం మొత్తం బరువు నుండి రాళ్ళ బరువును మినహాయించి, బంగారం బరువును మాత్రమే లెక్కించి వసూలు చేసి రాళ్ళ ఖరీదును అదనంగా వసూలు చెయ్యాలి. ఈ విధంగా కాకుండా బంగారం యొక్క స్వచ్చత విషయంలో కూడా వినియోగదారులు మోసపోతున్నారు. వినియోగదారులు 10 గ్రా. బంగారు ఆభరణం కొనుగోలు చేస్తే (10 గ్రా అంటే రూ.31500) కనీసం రూ.7000 నుండి రూ.8000 వరకు మోసపోతున్నారు. కనుక బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

bangaaru-abharanala-konugolulo-jagrathalu-3

ఈ విధంగా బహిరంగంగా, విచ్చలవిడిగా వినియోగదారులను మోసం చేస్తున్నప్పటికీ, నియంత్రించాల్సిన తూనికల, కొలతల శాఖాధికరులు మొద్దునిద్రలో జోగుతున్నారు. ఇప్పటికైనా నియంత్రించాల్సిన అధికారులు విరివిగా దాడులు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన దుకాణాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆయా దుకాణాల్లో వినియోగదారులు కొనుగోలు సమయంలో తెలుసుకొనేలా బోర్డులను ఏర్పాటు చెయ్యాలి. తద్వారా వినియోగదారులు అవగాహన పెంపొందించుకొని కొనుగోలు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

మోసపోకుండా ఉండాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి:

హాల్ మార్క్ ఆభరణాలనే కొనుగోలు చెయ్యాలి.
కొనుగోలు చేసిన ఆభరణాలకు ఖచ్చితంగా రసీదు పొందాలి.
తూకం విషయంలో ఏమైనా అనుమానం వస్తే తూనికలు కొలతల శాఖ వారిని వెంటనే సంప్రదించాలి.
తగిన ఆధారాలతో జిల్లా వినియోగదారుల ఫోరంను సంప్రదించాలి.

హాల్ మార్కింగ్ అంటే ఏమిటి ?

హాల్ మార్క్ అంటే బంగారం యొక్క స్వచ్ఛతకు భారత ప్రభుత్వ సంస్థ బి.ఐ.ఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వారు ఇస్తున్నటువంటి ధృవీకరణ. ఇటీవల భారత ప్రభుత్వం బంగారు నగలకు హాల్ మార్క్ ను తప్పని సరి చేసింది. ఏ వ్యాపారస్తుడైన హాల్ మార్కింగ్ వేయించుకోవాలంటే తాను చేసిన లేదా తయారు చేయించిన నగలను హాల్ మార్క్ జారీ చేసేటువంటి బి.ఐ.ఎస్ వారికి పంపించాలి.

బి.ఐ.ఎస్ వారు ఎలా మార్కింగ్ వేస్తారంటే:

బి.ఐ.ఎస్ వారు పై పై మెరుగులు చూసి మాత్రం హాల్ మార్క్ ఇవ్వరు. బి.ఐ.ఎస్ వారు, అమ్మకందారుడు పంపించిన నగలను వివిధ పద్ధతులలో మొత్తం నగను పరీక్షించి అందులో ఉన్నటువంటి స్వచ్ఛతకు నాలుగు రకాల హాల్ మార్క్ గ్రేడింగ్ ఇస్తారు. ఆ నగ 23 క్యారెట్లు, 20 క్యారెట్లు, 19 క్యారెట్లు తదితర గ్రేడింగ్ లను ఇవ్వడం జరుగుతుంది. హాల్ మార్క్ నగలు అని షాపు వారు చెప్పిన వెంటనే గుడ్డిగా నమ్మకుండా వాటిలో మనం 4 విషయాలను గుర్తించాలి.

బి.ఐ.ఎస్ వారి లోగో

స్వచ్చతను తెలిపే సంఖ్య.
ఉదా: 958,916,875,750,708.958 అనగా 23 క్యారెట్లు,
916 అనగా 22క్యారెట్లు,
875అనగా 18 క్యారెట్లు,
750 అనగా 14 క్యారెట్లు,
585 అనగా 9 క్యారెట్లు మొదలగునవి
హాల్ మార్క్ వేసిన దుకాణం యొక్క లోగో
హాల్ మార్క్ వేసిన సంవత్సరపు అక్షరం, ఉదా..ఆ=అనగా 2000, భ్= అనగా 2001, ఛ్=అనగా 2002, ఝ్= అనగా 2008, ణ్=అనగా 2011, ఫ్= అనగా 2012 మొదలగునవి.

వి.ప్రసూన, టీచింగ్ అసోసియేట్,
జి.వి.సుష్మ, టీచింగ్ అసోసియేట్,
కాలేజ్ ఆఫ్ హోం సైన్స్, గుంటూరు.

bangaaru-abharanala-konugolulo-jagrathalu-2

Share this post


Watch Dragon ball super