అథ్లెట్ల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం

అథ్లెట్ల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారం

సాధారణ వ్యక్తులతో పోల్చినపుడు అథ్లెట్లు(ఆటగాళ్లు)శరీరాన్ని ఎక్కువగా కష్టపెడుతుంటారు. వాతావరణం, సమయం తదితర అంశాలతో నిమిత్తం లేకుండా గంటల తరబడి ఆటలు ఆడుతూ ఉంటారు. రోజులో నాలుగో వంతు సమయం మైదానంలో గడపాల్సి వస్తుంది. ఇంత సమయంతో పాటు శరీరాన్ని పని చేయించే క్రమంలో వీరు వీలున్నంత ఎక్కువగా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మరిముఖ్యంగా క్రికెట్, హాకీ, ఫుట్ బాల్ పోటీలలో మధ్య మధ్యలో కొన్ని పానీయాలు తీసుకునప్పటికీ ఆట ముగిసే సమయానికి ఆట గాళ్లు ఒంట్లోని కేలరీలన్నీ కోల్పోయి పూర్తిగా నీరసపడిపోతారు. విపరీతమైన చెమటతో పాటు అలసట ధాటికి ఎంత నీరు తాగినా ఎప్పటికప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది. అందుకే వారికి ప్రత్యేకమైన ఆహారంతో పాటు తక్షణ శక్తిని అందించే ఎలక్ట్రోలైట్లు కూడా అందించాలి. వారి శారీరక పరిస్థితికి తగిన రీతిలో పోషకాలు అందిచలేకపోతే క్రీడాకారులు తక్కువ సమయంలోనే నీరసపడిపోవటంతో పాటుఅలసట, కళ్ళు తిరగటం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి రావచ్చు. కనీసం అప్పటికీ స్పందించకపోతే అపస్మారక స్థితిలోకి పోయే ప్రమాదం కూడా ఉంది.

athletla-aarogyamkosam-tisukovalsina-aaharam-1

ఆటలైనా లేక మ్యాచ్ కు ముందు చేసే సాధన అయినా ప్రతి ఆటగాడు తగినంత నీరు తీసుకోవాలి. దీని వలన మూడు ప్రయోజనాలున్నాయి. అవి..

  • శరీరంలోని కణజాలానికి కావలసిన ఫ్లూయిడ్స్ అందించటం,
  • జీవక్రియలకు అవసరమైన గ్లూకోజ్ ను అందించటం, తద్వారా శరీరానికి తగిన శక్తినివ్వటం
  • శరీరంలోని జీవక్రియలు సాఫీగా జరిగేందుకు దోహాదపడటం

క్రీడాకారులు మైదానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఘనాహారం పనికిరాదు. ఈ సమయంలో వారికి కావలసిన పోషకాలను అందించి ఉత్సాహంగా ఉంచగలిగే శక్తి కేవలం ద్రవపదార్ధాలకే ఉంటుంది. అందుకే ఆటలాడేటప్పుడు విధిగా ఈ క్రింది అంశాల మీద దృష్టి పెట్టాలి.

athletla-aarogyamkosam-tisukovalsina-aaharam-2

  • చల్లని నీరు: ఏ రకమైన వ్యాయామం చేసే వారైనా విధిగా సరిపడా నీరు తాగాల్సిందే. ఏరోబిక్స్, తేలికైన బరువులు ఎత్తటం వంటి వ్యాయామాలు రోజుకు అరగంటకు మించి చేయాల్సిన పని లేదు. శరీరం పూర్తిగా అలసిపోయే దాకా ఉండకుండా తరచూ తగినంత నీరు తాగుతూ ఉండాల్సిందే.
  • ఓరల్ హైడ్రేషన్ద్రవాలు (ఓఆర్ఎస్): శారీరక శ్రమ కారణంగా శరీరం కోల్పోయే లవణాలు, ఇతర పోషకాలు సమకూర్చే ద్రవాలివి. ఎక్కువ సమయం పాటు కష్టతరమైన వ్యాయమాలు చేసేవారికి, గంట గంటన్నర పాటు గుండె కండరాలకు బలాన్నిచ్చే వ్యాయమాలు చేసేవారికి ఇవి తప్పనిసరి.
  • స్పోర్ట్స్ డ్రింక్స్: అత్యంత కఠినమైన వ్యాయమాలను గంటల తరబడి సాధన చేసేవారికి, మైదానంలో గంటల కొద్దీ ఆటలాడే వారికి స్పోర్ట్స్ డ్రింక్స్ అవసరం ఉంది. ఈ పానీయాలలో ఆరు నుంచి ఎనిమిది శాతం వరకు గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్స్ తో పాటు విటమిన్లు, లవణాలుంటాయి.

athletla-aarogyamkosam-tisukovalsina-aaharam-3

  • అమినో ఆమ్లాలు: ఎక్కువ సమయం పాటు వ్యాయమం చేసే వారికి “అర్జెనిన్” ” బీ సీసీఏ”అనే రెండు ప్రధానమైన అమినో ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. ఆటగాళ్లకు తక్షణ శక్తినిచ్చేదిగా “బీ సీసీఏ” ఉపయోగపడుతుండగా, అర్జెనిన్ కండరాలకు కావలసిన పోషణనందించి వాటిని కోలుకునేలా చేస్తుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ శక్తి కావాలనుకుంటే కొన్ని సార్లు అమైలో పెక్టిన్ స్టార్చ్ ను కూడా వాడతారు. మంచి ఆరోగ్యాన్ని, శారీరక పటుత్వాన్ని కోరుకునే వారంతా మంచి పౌష్టికాహారంతో పాటు ఆశావాదదృక్పధాన్ని అలవరచుకోవటమే గాక సంతోషంగా ఉండాలి.

Share this post


Watch Dragon ball super