అమృతాన్ని పంచే అరటిపండు

అమృతాన్ని పంచే అరటిపండు

ప్రస్తుతం మనం ఆరగిస్తున్న అరటిపండ్లకు ఎంతో పురాతన చరిత్ర ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఈ అరటి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించింది. అరటిపండు అన్ని వయస్సుల వారికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత ఫలం. ఇటీవల కాలంలో అరటిలో వివిధ రకాలను రూపొందిస్తూ పండిస్తున్నారు. ఈ అద్భుత ఫలంతో అందే ప్రయోజనాలివే!

amruthannipanche-aratipandu-1

అరటిపండు-ప్రయోజనాలు

  • దీనిలో అత్యధిక పోషక విలువలు, పీచు పదార్ధం ఉంది. అరటిపండులోని పీచు పదార్ధం మనలోని జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  • ఇది లోవర్ బ్లడ్ కొలెస్ట్రాల్ (ఎల్ డి ఎల్ ), గ్లూకోజ్ స్థాయిలను కాపాడుతుంది.
  • అరటిపండులో అధిక శాతం లో పొటాషియం నిల్వలు ఉన్నాయి. ఇది సాధారణ రక్తపోటును అదుపులో ఉంచేందుకు దోహాదపడుతుంది.
  • భోజనం అనంతరం చాలా మంది అరటి పండును తింటారు. అలాగే అరటి పండులో చక్కర నిల్వలు 17 నుంచి 19 శాతం వరకు ఉన్న కారణంగా వీటిని తీపి పదార్ధాల తయారీలో వినియోగిస్తుంటారు.
  • అరటిపండును భారతదేశంలో “పంచామృతాల”లో ఒకటి గా భావిస్తారు. అలాగే దీనితో చిప్స్, చాక్లెట్లు, జామ్, జెల్లీలను రూపొందిస్తారు.
  • అరటిపండును రోజు తినడం వలన శరీర బరువు తగ్గుతుంది. దీనిలోని పీచు పదార్ధం జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.
  • బరువు పెరిగేందుకు కూడా అరటిపండు దోహాదపడుతుంది. ప్రతి రోజు రెండు అరటి పండ్లను తినడం వలన శరీర బరువు పెరుగుతుంది.
  • అరటిపండు అలసట, నిస్సత్తువను దూరం చేసేందుకు ఉపకరిస్తుంది.
  • 100 గ్రాముల బరువుండే అరటిపండులో 117 కేలరీలు, 1.2 గ్రాముల ప్రోటీన్లు,0.3 శాతం క్రొవ్వు పదార్ధం ఉంటుంది.

amruthannipanche-aratipandu-2

Share this post


Watch Dragon ball super