అమ్మపాలు-అమృతం

అమ్మపాలు-అమృతం

బిడ్డను నవమాసాలు మోసినప్పటి కన్నా, తల్లి ప్రయాణం ఆ పసికందు భూమి మీద పడినప్పుడు  ఆ తల్లి ప్రయాణం మొదలవుతుంది. చక్కటి పాపాయి పుట్టిందన్న ఆనందం ఒకవైపు, బిడ్డను ఆరోగ్యంగా పెంచాలన్న ఆందోళన మరోవైపు ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం తల్లిపాలు తప్పనిసరి; తల్లిపాలు ప్రకృతి ప్రసాదం, దివ్యఔషధం. సృష్టిలో ప్రతిదిపరస్పర ఆధారంగానే జరుగుతుంది. పురుడు వచ్చే సమయానికి తల్లికి పాలు ఉత్పత్తికావడం. అప్పుడే  పుట్టిన బిడ్డకి ఏమీ తెలియదు కానీ, పాలు తాగే విద్య మాత్రమే తెలియడం, అమ్మ కౌగిలిలో వెచ్చదనం, అమ్మపాలలో కమ్మదనం, నేను అమ్మదగ్గరే ఉన్నాననే భద్రతా భావం నిత్యం అనుభవించాలని పుట్టిన బిడ్డ భావించడం సృష్టిలో తెలియకుండానే జరిగిపోతాయి. ఇది సృష్టి ధర్మం.

ammapaalu-amrutham-1

కానీ ఇప్పుడా సృష్టి ధర్మానికి విరుద్ధంగా జరుగుతోంది. నేటి తరo తల్లులు కొoదరు తమ అందం పాడవుతుందనే మూర్ఖత్వం వల్ల అమృత తుల్యమైన తల్లిపాలను బిడ్డకు దూరం చేస్తున్నారు. అంతేకాదు అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లిపాలు అందిస్తే బిడ్డకు హానికరం అనే అపోహాతో కొందరు తల్లి పాలను ఇవ్వడం లేదు. ఒక దశలో తల్లులు మన పాలకంటే, డబ్బా పాలే మంచివి అని కూడా అనుకున్నారు.  అందుకని తల్లిపాలు ఇవ్వడం లేదు. కాని తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక బాధ్యత. ఈ విషయం మరిచి బిడ్డ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొందరు తల్లులు. డబ్బాపాలు వద్దు అమ్మపాలు ముద్దు అని తల్లిపాలు ప్రాధాన్యతను తెలియచెప్పడానికి ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటివారం తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టత పై ప్రత్యేక కధనం;

అమ్మపాల కోసం ఉద్యమం
ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం, అంతరించిపోతున్న తల్లిపాల సంస్కృతి వల్ల ఏటా వివిధ రోగాలతో దాదాపు 10 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారట. పారిశ్రామికీకరణ ఆరంభ మైన దశలో పాలపొడులు, డబ్బపాల ఉత్పత్తి ఎక్కువగా పెరగడంవల్ల చాలామంది తల్లులు డబ్బా పాలు పై ధార పడితల్లిపాలు ఇవ్వడం తగ్గించేశారు. దీనివల్ల పిల్లలు న్యూమోనియా, విరేచనాలు లాంటి వ్యాధులకు గురికావడం సాధారణమైoది. ఈ సమస్యను గుర్తించిన కొన్ని సంస్థలు చిన్నపిల్లల రక్షణ కోసంఅనేక ఉద్యమాలు నిర్వహించారు. అలా మొదలైన ఆ ఉద్యమాలు ప్రభావం వల్ల 1990 నాటికి అంతర్జాతీయ పాలపొడులు ఉత్పత్తిదారులు సమాఖ్య ఆసుపత్రులకు ఉచితంగా పాలపొడులను అందించడం, సబ్సిడీలతో పాలపొడులు అమ్మడం స్వచ్ఛందoగా విరమించడానికి అoగీకరిoచిoది.

ఇటలీ దేశం, ఫ్లారెన్స్ నగరం, ఇనోసెంటి సెంటర్, జూలై ౩౦, 1990 నుండి ఆగష్టు 1, 1990 వరకు తల్లిపాల పై ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశం లో ఒక ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనను ఇనోసెంటిప్రకటన అంటారు. ఈ ప్రకటనను పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లి పాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్ ఫర్ ఫీడింగ్ ఏక్షన్) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు హెచ్ ఓ (WHO),యునిసెప్(UNICEF) బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపుతున్నారు.

తల్లిపాలతో లాభాలివీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్స్ ప్రకారం శిశువుల గరిష్ట పెరుగుదలను, ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదటి 6 నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడo శ్రేయస్కరం.

ammapaalu-amrutham-2

Share this post


Watch Dragon ball super