ఆకుకూరలు ఆరోగ్యానికి సిరులు

ఆకుకూరలు ఆరోగ్యానికి సిరులు

శరీరానికి కావలసిన పోషక పదార్ధాలు అన్ని తగు మోతాదులో అందించేది పోషకాహారం. ఆహారంలో పోషక పదార్ధాలు తగు
మోతాదులో లేనపుడు లేదా కొన్ని పోషక పదార్ధాలు మరీ ఎక్కువగా ఉన్నపుడు మనం అనారోగ్యానికి గురవుతాము. మనకు చౌకగా
లభించే ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మనం సాధారణంగా వాడే ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, కొత్తిమీర,
మెంతికూర, పాలకూర, పుదీనా ప్రధానమైనవి. ప్రతిరోజు ఆహారంలో దాదాపు 20% వరకు ఆకుకూరలు తీసుకోవడం మంచిది వీటి
వలన అనేక లాభాలున్నాయి.

aakukuralu-aarogyaniki-sirulu-6

ఆకుకూరలు కంటిచూపును పరిరక్షిస్తాయి, ఆకుకూరల్లో విటమిన్ ఎ కెరొటినాయిడ్, క్సైంతిన్
రూపంలోనిల్వ ఉంటుంది. అందువలన ఇవి అత్యంత కాంతివంతంగా వచ్చే వెలుతురును కూడా నియంత్రించగలిగే శక్తిని
కలిగి ఉంటాయి. కనుక కంటిచూపు పరిరక్షించబడుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన పెద్దపేగు క్యాన్సర్ ను
నివారించగలుగుతాయి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే పోషక పదార్ధం విటమిన్ కె ఇది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది.
ఇది ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాలలో రాళ్ళు వంటి వాటిని నియంత్రించకలిగే శక్తిని కలిగిఉంటుంది.
కొలెస్ట్రాలును తగ్గించే గుణం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది లివర్ లో కొలెస్ట్రాలును వినియోగించుకొని బైల్ యాసిడ్ ను
తయారుచేస్తాయి, బైల్ యాసిడ్ అనేది క్రొవ్వు జీర్ణ ప్రక్రియలో తొడ్పడుతుంది. ఆకుకూరలు శరీరానికి కావలసిన ఇంధనాన్ని
ఉత్పత్తి చేస్తాయి. ఆకుకూరల్లో బి విటమిన్లు, ముఖ్యంగా బి5 (పాంటోథెనిక్ యాసిడ్) ఉంటాయి. ఇవి పిండిపదార్థాలను గ్లూకోజ్
రూపంలోకి మార్చడంలో తోడ్పడతాయి, ఈ గ్లూకోజ్ శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఇది పనిచేస్తుంది. ఆకుకూరలు ఎముకల
ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. వీటిలో కాల్షియం అనే ఖనిజలవణం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ముఖ్యంగా 31-35
సంవత్సరాల వయస్సు మహిళలు 1000 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. విటమిన్ కె ఎక్కువగా ఉండడం వలన గుండె రక్తనాళాల
జబ్బులు, ఎముకలు గుల్లబారటం, రక్తనాళాల్లో, మూత్రపిండాలలో రాళ్ళు వంటి వాటిని నియంత్రించకలిగే శక్తి వీటికి ఉంటుంది.

ఆకుకూరలు వండేటప్పుడు ముందుగా వాటిని కడిగి తరువాత కోయాలి, కోసాక నీళ్ళలో వేస్తే వాటిలొ ఉండే నీటిలో కరిగే బి
విటమిన్లు వృధా అయిపోతాయి. ఆకుకూరలు వండేటప్పుడు తక్కువ నూనెతో వండాలి లేకపోతే నూనెలో కరిగే కె విటమిన్
ఉండడం వలన ఎక్కువ నూనె కనుక వాడినట్లయితే అది వృధా అయిపోతుంది. ఆకుకూరలు ఉడికించేటప్పుడు నీళ్ళు
పోయకుండానే, వాటిలో ఊరే నీళ్ళతో ఉడికించాలి. రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి వండటం వలన అన్నిరకాల
ఖనిజలవణాలు మరియు విటమిన్లు పొందవచ్చును. ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వలన పోషకపదార్థాల సమతుల్యత
లభిస్తుంది. రోగాల బారి నుండి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి కాబట్టి వీటిని రక్షిత ఆహార
పదార్థాలు అని కూడా అంటారు.

పాలకూర

విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఇవి రోగ నిరోధకశక్తికి మరియు ఎముకల సాంద్రతకు తోడ్పడతాయి.

aakukuralu-aarogyaniki-sirulu-12

గోంగూర

విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాక విటమిన్ సి కూడా తగు మోతాదులో
లభిస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-15

బచ్చలి కూర

విటమిన్ ఎ, విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. అందువలన రక్తకణాలు ఏర్పడడానికి
ఉపయోగపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

aakukuralu-aarogyaniki-sirulu-14

పొన్నగంటి

విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది, ఎముకలకు బలాన్ని
చేకూరుస్తుంది మరియు శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-9

తోటకూర

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగాపడతాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా
ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తాయి మరియు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి.

aakukuralu-aarogyaniki-sirulu-8

చుక్కకూర

విటమిన్ ఎ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి, అందువల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.

aakukuralu-aarogyaniki-sirulu-16

మునగాకు

అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన
రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-7

మెంతికూర

పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువు కలవారికి మరియు గుండె ఆరోగ్యానికి మంచిది.
ఇందులొ సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

aakukuralu-aarogyaniki-sirulu-13

కొత్తిమీర

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను
తగ్గిస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-11

పుదీన

యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని
తగ్గిస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-1

కరివేపాకు

బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సంరక్షణకు మంచిది. అరుగుదల శక్తిని పెంచుతుంది.

aakukuralu-aarogyaniki-sirulu-2

క్యాబేజి

గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ సి ఎక్కువగా
ఉంటాయి. కొలైన్ ఎక్కువగా ఉండటం వలన నరాల బలహీనతను తగ్గిస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-4

గంగవల్లి

ఒమేగ-3 ఫాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికి రానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని
తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.

aakukuralu-aarogyaniki-sirulu-3

కాలీ ఫ్లవర్

కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువలన ఎముకలకు, పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

aakukuralu-aarogyaniki-sirulu-5

Share this post


Watch Dragon ball super