ఆహార భద్రత

ఆహార భద్రత

మనిషి జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. అలాగే మనిషి జీవించడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలి, ఆహారం తినడానికి జీవించకూడదు. మనం తీసుకునే ఆహారం పరిశుభ్రంగా, పౌష్టికంగా మరియు ఎటువంటి కల్తీ లేకుండా చూసుకోవాలి. ఆహారం అనగా పోషక విలువలతో ఉన్న సమతుల ఆహారం. సమతుల ఆహారం అనగా ధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, పాలు మరియు పాల పదార్ధాలు అన్ని సమానంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తీసుకోవలసిన ముఖ్యమైన వ్యక్తిగత జాగ్రత్త. ఆహార భద్రత అంటే ఈ సమతుల ఆహారాన్ని ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా జీవించేందుకు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రధాన లక్ష్యం.

aahara-badratha-1

మన దేశంలో ఆహార ధాన్యాలు అవసరమైన దాని కన్నా రెండింతలు అధికంగానే ఉన్నాయని అంచనా అయినప్పటికీ దారిద్ర్యం, ఆకలి, పౌష్టికాహార లోపం అధికంగానే ఉన్నాయి. ఆహరం నిల్వలున్నా పంపిణీ సక్రమంగా లేకపోతే, పంపిణీ జరిగినప్పటికీ ప్రజలు వినియోగించుకోనట్లయితే ఆహార అభద్రత.

ఆహార భద్రత అనేది అందరి బాధ్యత.

వ్యక్తిగత బాధ్యత
కుటుంబ బాధ్యత
సమాజ బాధ్యత
ప్రభుత్వ బాధ్యత

1. వ్యక్తిగత బాధ్యత:

మనం జీవించడానికి ఉపయోగపడే ఆహారాన్ని ఏ విధంగా వృధా చేయరాదు. అలాగే ప్రతి ఒక్కరు వారికి సరిపడినంత ఆహారాన్ని మాత్రమే తినాలి. వీలైనంత వరకు తాజాగా, సురక్షితంగా ఉన్న ఆహారాన్నే తినాలి, పాడైపోయిన ఆహార పదార్దాలను వృధా అయిపోతాయని ఎప్పుడూ తినరాదు. అవి తినడం వలన ఇంకా అనారోగ్యం బారిన పడతారు.

aahara-badratha-4

2. కుటుంబ బాధ్యత:

aahara-badratha-3

కుటుంబంలో ప్రతి ఒక్కరికి సరిపడా పోషకాహారాన్ని అందిoచడమే కుటుంబ బాధ్యత. అలాగే ప్రతిరోజు కుటుంబానికి ఎటువంటి కొరత లేకుండా సరిపడినంత ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, మాంసాహారాలు, పాలు మరియు పాల పదార్దాలు సమకూర్చుకోవాలి. కుటుంబములో ఆహార కొరతను అరికట్టాలంటే కుటుంబానికి సరిపోయినంత ఆహారాన్ని మాత్రమే వండుకోవాలి. ఇందువలన ఆహారం వృధా కాకుండా ఉంటుంది. ఒకవేళ ఆహారం మిగిలినట్లయితే సురక్షితమైన పద్ధతిలో నిల్వ చేసుకోవాలి లేకపోతే ఆహారం కాలుష్యానికి గురి అవుతుంది, ఆరోగ్య సమస్యలు దరి చేరతాయి. ఆహారపదార్దాలను చవకగా దొరికే కాలంలో కొనుక్కొని సురక్షితంగా నిల్వ ఉంచినట్లయితే అవి సంవత్సరమంతా కుటుంబానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఖర్చును అదుపులో ఉంచుకోవడానికి పెరటి తోట – కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, తీగ జాతి పంటలు, కోళ్ళని, పశువుల్ని పెంచుకోవచ్చు. అవి కొంతవరకు ఆహార కొరతను తగ్గిస్తాయి.

3. సమాజ బాధ్యత:

సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆహార వృధాను అరికట్టడానికి వారి స్థాయిలో కృషి చేయాలి. ముఖ్యంగా సమాజంలో జరిగే వేడుకలలో, అందరు కలిసి జరుపుకొనే పండుగలలో వృధా అయ్యే ఆహారాన్ని పారవేయకుండా అనాధ ఆశ్రమాలకు, శరణాలయాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అలాగే నవీన వ్యవసాయ పద్దతుల ద్వారా ఆహార ఉత్పత్తిని పెంపొందించి, వాటి గురించి ఆ పరిజ్ఞానాన్ని రైతులందరికీ తెలియచేయాలి. ఆహారపదార్ధాలలో కల్తీలేకుండా ఎటువంటి రసాయన పదార్ధాలు కలపకుండా ప్రతి ఒక్కరు భాద్యత వహించాలి.

aahara-badratha-7

• రైతులు ఒకే పంటను భూమిలో సాగుచేయటం వలన భూమి సారం కోల్పోయి ఆహార దిగుబడి తగ్గి, ఆహార అభద్రత కలుగుతుంది, అందువలన పంటల సరళిలో మార్పు చేసి రకరకాల పంటలు పండించాలి.
• ఎక్కువ విస్తీర్ణములో ఒకే పంట వేయడం వలన పురుగులు, తెగుళ్ళ సమస్య ఎక్కువై ఆహార దిగుబడి తగ్గితుంది. దీని పట్ల అప్రమత్తత కావాలి.
• సన్న బియ్యం, తెల్లని అన్నం అంటూ పరుగులు తియ్యకుండా మరచిపోయిన చిరుధాన్యాలు, ఆకుకూరల వినియోగాన్ని పెంచుకోవాలి
• వరి, గోధుమల సాగుకంటే చిరుధాన్యాల సాగుకు నీటి అవసరం తక్కువ, తక్కువ ఖర్చుతో మెండు పోషకాలు, ఔషద విలువలు గల చిరుధాన్యాల సాగును పెంచాలి.
• ఆహార అలవాట్లు, మారుతున్న జీవనశైలి వలన వచ్చే మధుమేహం, గుండెజబ్బుల నివారణకు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవటం చాలా అవసరం.

4. ప్రభుత్వ బాధ్యత:

aahara-badratha-8

ప్రభుత్వo అన్ని రకాల ఆహార పదార్దాలు ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉండేలా తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. అలాగే ఆరోగ్యంపైన పోషకాహారo ప్రభావం, దాని యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలలో అవగాహన కల్పించాలి . ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం వలన ఆహార భద్రత కలుగుతుంది. దేశ ఆహార భద్రత కొరకు ప్రభుత్వ గోడౌన్లలో ఉన్న లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోకుండా చర్యలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, ప్రతి ఒక్కరు కొనుక్కోగలిగే రీతిలో అందుబాటులో ఉంచాలి.

• పాడి పశువులు, కోళ్ళు, గొర్రెలు, చేపలు మొదలైన పశుసంపదను ప్రోత్సహించడం వలన పోషకాహార భద్రత కలుగుతుంది. ఇంటింటా టీవీ, మనిషికొక్క చరవాణి సమకూర్చుకున్నట్లే పాలు, పండ్లు, కూరగాయలు సమకూర్చుకోవాలి.
• ప్రభుత్వ సంక్షేమ పధకాలను అర్హత గల లబ్దిదారులను ఎన్నిక చేయటంలో జాగ్రత్త వహించాలి. అవసరతలో ఉన్నవారికే లబ్ధి కలుగుతుంది .
• చిన్న సన్నకారు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పుడే ఆహార భద్రత సాధ్యం.
•జాతీయ ఆహార భద్రత బిల్లు-2011 ముసాయిదా ప్రకారం చిరుధాన్యాలైన జొన్న, రాగి, సజ్జ, కొర్ర మొదలగు వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలి.
• స్వార్ధపూరిత వ్యాపారులు సృష్టిస్తున్న కృత్తిమ ఆహార ధాన్యాల కొరత, గురించి ప్రజలలో అవగాహనను పెంచి ధరలు నియంత్రిస్తేనే ఆహార భద్రత కలుగుతుంది .
• ఆహార భద్రత కోసం ఆహారపదార్ధాల – విలువల సమాహారం రూపొందించడం. కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వివిధ ఉత్పత్తులను తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు .

ఆహార భద్రతను గురించి తెలియజేసే సూచికలు:

• భోజనం విషయములో వైవిధ్యాన్ని పాటించడం. ఉదాహరణకు ధాన్యాలకు బదులు చిరుధాన్యాలు /అన్నానికి బదులు రొట్టెలు, సంగటి, పచ్చికూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పుదినుసులు తినడం మొదలైనవి.
• సంవత్సరానికి సరిపడా, నాణ్యమైన ఆహారం కుటుంబానికి అందుబాటులో ఉండటం. అలాగే కాలానికి అనుగుణంగా దొరికే ఆహారపదార్ధాలను నిల్వచేసుకొని అవి దొరకని కాలంలో తినగలగడం.
• ప్రధాన ఆహారపదార్ధాలను పండించుకొని కుటుంబానికి ఒక సంవత్సరానికి సరిపోయే ఆహారం నిల్వచేసుకోవడం.
• పాడి కోసం ఆవులు, గేదలను పోషించి ఆదాయాన్ని పొందడం. కుటుంబానికి అవసరమైన పాలు, పాలపదార్ధాలను ఉంచుకొని మిగిలినవి అమ్మడం.
• గుడ్లు, మాంసం కోసం కోళ్ళను పెంచడం మరియు కుటుంబ ఆదాయం కోసం మేకలు, గొర్రెలు మొదలైనవి పెంచడం.
• కుటుంబ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం కొనుగోలు కోసమే వినియోగించడం. అలాగే విలువైన వస్తువులు, పొలాలు, స్థలాలు కోసం ఎక్కువ డబ్బు వెచ్చించకూడదు.
• ఆరోగ్యమే మహాభాగ్యం ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.
• కూరగాయల కొరత లేకుండా చూసుకోవడానికి పెరటితోటలు పెంచడం. ఇంటిలోని కూరగాయల వ్యర్ధాలను ఎరువుగా ఉపయోగించడం.
• రేషన్ దుకాణములో సరఫరా చేసే అన్ని సరుకులను కొనుగోలు చేసి వాడు కోవడం. రేషను సరుకులలో నాణ్యత తక్కువగా ఉండే వాటిని ఆహారేతర అవసరాలకు వాడుకోవడం.
• మన దేశంలో ఆహార ధాన్యాలు అవసరమైన దాని కన్నారెండింతలు అధికంగానే ఉన్నాయని అంచనా అయినప్పటికీ దారిద్ర్యం, ఆకలి, పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది.
• ఆహారం నిల్వలున్న పంపిణీ సక్రమంగా లేకపోతే, పంపిణీ జరిగినప్పటికీ, ప్రజలు వినియోగించుకోనట్లయితే ఆహార భద్రత లేనట్లే. దీనినే మనం ఆహార అభద్రత అంటాము.
• ఆహారం కొరత లేకుండా అందరికి ఆహారం అందుబాటులో ఉండాలి, ఆహార అభద్రత లేకుండా చూసుకోవాలి.
• ఆహార భద్రత బహుముఖ అంశంగా పరిగణించాలి ఎందుకంటే ఇది చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అభద్రతకు కారణాలు:

• జనాభా విస్పోటనం మరియు ఆహారపదార్దాలు నిల్వచేయడానికి సరిపడా యాంత్రిక, శీతలీకరణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం.
• చిరుధాన్యాల వంటి పౌష్టిక విలువలు కలిగిన పంటల సాగును మరచిపోవడం, వ్యాపార దృష్టి వలన వాణిజ్య పంటల పట్ల మోజు పెరగటంతో ఆహార పంటల సాగులో అసమానతలుండటం.
• కాలానికి అనుగుణంగా పండే పంటలను సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ ఉత్పత్తుల రూపంలో నిల్వ చేసుకోలేకపోతున్నాం.
• ఆహారపు అలవాట్లపై పాశ్చ్యాత్య వంటకాల ప్రభావం వలన కుటుంబ ఆహార విధానంలో మార్పులురావడం.
• ఆహారంపై కాకుండా ఇతర అవసరాలపై ఎక్కువ ఖర్చు చేయడం.
• ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రధానాహార ధాన్యాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం. అలాగే చిరుధాన్యాలకు కూడ ప్రాధాన్యతను ఇవ్వాలి.

aahara-badratha-10

Share this post


Watch Dragon ball super